రాజకీయాల్లో హుందాతనం అవసరం | - | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లో హుందాతనం అవసరం

Nov 20 2026 2:30 AM | Updated on Nov 20 2026 2:30 AM

● ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్లు మాట్లాడం సరికాదు

● విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ డిజిటల్‌ బుక్‌ చైర్మన్‌ శిమ్మ రాజశేఖర్‌ ధ్వజం

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): శ్రీకాకుళం రాజకీయాలకు ప్రత్యేకమైన గౌరవం, హుందాతనం ఉన్నాయని, గతంలో ఈ ప్రాంతాన్ని పాలించిన ఏ పార్టీ నాయకులు ప్రస్తుత ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాదిరి మాట్లాడలేదని వైఎస్సార్‌సీపీ డిజిటల్‌ బుక్‌ చైర్మన్‌ శిమ్మ రాజశేఖర్‌ అన్నారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత గౌరవానికి ప్రాధాన్యత ఇచ్చేవారని అలాంటి రాజకీయ సంప్రదాయాలకు భిన్నంగా స్థానిక ఎమ్మెల్యే దిగజారుడు వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. శ్రీకాకుళం మేయర్‌ అభ్యర్ధి గుండ లక్ష్మీదేవిపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదవిలోకి వచ్చిన నాయకులు ఆ అవకాశాన్ని ప్రజాసేవకు వినియోగించుకోవాలే తప్ప ఇతరులను వ్యక్తిగతంగా విమర్శించడం, దూషించడం నాయకత్వ లక్షణం కాదన్నారు. గుండ అప్పలసూర్యనారాయణ కౌన్సిలర్‌ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ప్రజలకు, పార్టీకి సుదీర్ఘకాలం సేవలందించారని, అలాంటి కుటుంబం గురించి మాట్లాడేటప్పుడు రాజకీయ సంస్కారం ఉండాలన్నారు. రాజకీయాల్లో పదవులు, అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలన్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్‌ శ్రీకాకుళం నియోజకవర్గానికి, పట్టణ అభివృద్ధికి ఇప్పటివరకు ఏం చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు 2004 నుంచి శ్రీకాకుళం నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు.

● రాష్ట్ర తూర్పు కాపు సంఘం అధ్యక్షులు మామిడి శ్రీకాంత్‌ మాట్లాడుతూ వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్నాయని, ఈ సమయంలో ప్రజలకు ఏం చేశారో అధికార పార్టీ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఇతరులను విమర్శించడం, వ్యక్తిగత దూషణలకు దిగ డం తప్ప ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు.

● వైఎస్సార్‌ సీపీ మీడియా కో–ఆర్డినేటర్‌ రత్నాల నరసింహమూర్తి మాట్లాడుతూ గుండ కుటుంబం నాలుగు దశాబ్దాలకు విశిష్ట సేవలు అందించారన్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడటం ఎమ్మెల్యే దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా గుండ లక్ష్మీదేవిని ఓడించడం సాధ్యం కాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement