వైఎస్సార్‌ సీపీలో పలు కుటుంబాల చేరిక | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలో పలు కుటుంబాల చేరిక

Nov 20 2026 2:30 AM | Updated on Nov 20 2026 2:30 AM

సారవకోట : అన్నుపురం పంచాయతీకి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌ సీపీలోకి ఆ పార్టీ నాయకులు ఎడ్ల రంగారావు సమక్షంలో గురువారం చేరారు. లుకలాపు రామారావు, మూలుగు పోలీసు, లక్ష్మిపురం మహేశ్వరరావు, పాలకొండ మనోజ్‌, కొత్తూరు కృష్ణారావు, పారశింగి శివ, పాలకొండ షణ్ముఖరావులతో పాటు మరికొన్ని కుటుంబాల వారు మాజీ జెడ్పీటీసీ సభ్యులు ధర్మాన కృష్ణ చైతన్య సమక్షంలో నరసన్నపేట పార్టీ కార్యాలయంలో పార్టీ కండువాలు ధరించారు. సర్పంచ్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారుల విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు వరుదు వంశీకృష్ణ, పార్టీ జిల్లా కార్యదర్శి యాళ్ల శ్యామసుందరరావు, తదితరులు పాల్గొన్నారు.

గుండ లక్ష్మీదేవి సమక్షంలో మాజీ వార్డు సభ్యుడి చేరిక

అరసవల్లి: కార్పొరేషన్‌ 3వ డివిజన్‌ పరిధిలో అరసవల్లి ఆదిత్యనగర్‌ కాలనీకి చెందిన మాజీ వార్డు సభ్యుడు కొబగాపు పోలినాయుడు గురువారం వైఎస్సార్‌సీపీలోకి చేరారు. పార్టీ మేయర్‌ అభ్యర్ధి గుండ లక్ష్మీదేవి కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పోలినాయుడు మాట్లాడుతూ లక్ష్మీదేవిని మేయర్‌గా గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తానని, 3వ డివిజన్‌ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటామని ప్రకటించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు గంగు సీతాపతి, ఆదిత్యనగర్‌ కాలనీ ముఖ్యులు లక్ష్మణ్‌, మాజీ వార్డు సభ్యుడు రామకృష్ణ, శ్రీనివాస్‌, గొలివి అనంత్‌, కునుకు గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement