కారు బోల్తా.. ముగ్గురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

కారు బోల్తా.. ముగ్గురికి గాయాలు

Nov 20 2026 2:30 AM | Updated on Nov 20 2026 2:30 AM

ఇచ్ఛాపురం రూరల్‌: యువకుల అతివేగం రోడ్డు ప్రమాదానికి కారణమైంది. కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీ కొనడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలలోకి వెళితే...ఇచ్ఛాపురం పట్టణం దానంపేటకు చెందిన కారు డ్రైవర్‌ ధనరాజు గురువారం ఉదయం తన స్నేహితులు షరాబు వీధికి చెందిన దుర్గేష్‌ బెహరా, సడయి చరణ్‌లతో కారులో బయలుదేరారు. ఒడిశా సుమండీలోని పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆయిల్‌ కొట్టి జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చి బెల్లుపడ వద్ద జాతీయ రహదారి పక్కనున్న డివైడర్‌ను అదుపుతప్పి ఢీకొట్టారు. కారు పల్టీలు కొట్టినా ఎయిర్‌ బ్యాగులు తెరుచుకోవడంతో చెల్లాచెదురుగా పడిపోయారు. అదే సమయంలో కలెక్టర్‌ కార్యక్రమానికి పోలీస్‌ జీపులో వెళ్తున్న స్థానిక సీఐ ఎం.చిన్నంనాయుడు, టౌన్‌ ఎస్‌ఐ ఎం.ముకుందరావులు ప్రమాదాన్ని గమనించి క్షతగాత్రులను తమ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. దీంతో యువకులకు ప్రాణాపాయం తప్పింది. చరణ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్‌ ఎస్‌ఐ ఎం.ముకుందరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement