● బోన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడు
● కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు వెల్లడి
● దాతలే ఆదుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి
శ్రీకాకుళం రూరల్: జిల్లా కేంద్రం సమీపంలోని రాగోలు గ్రామంలో నివాసముంటున్న రాజు, పుణ్యవతి దంపతుల పదేళ్ల కుమారుడు సింగవరపు రాజగోపాల్ బోన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో క్యాన్సర్ వ్యాధి బారిన పడడంతో నాలుగేళ్లుగా తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. కూలి పనులు చేసుకుంటున్న కుటుంబ సభ్యులు ఇప్పటికే రూ.20 లక్షలు వరకు అప్పులు చేసి ఖర్చుపెట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. విశాఖపట్నం తీసుకెళ్లి కీమోతో పాటు మందులు, రక్తం ఎక్కించేందుకు ప్రతినెలా రూ.10 వేలకు పైగానే ఖర్చు అవుతోందని తండ్రి రాజు కన్నీటి పర్యాంతమయ్యారు. అమెరికాలో లభ్యమయ్యే ఇంజక్షన్‌ను బాలుడికి వేస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చునని విశాఖపట్నం వైద్యులు తెలియజేశారు. ఇందుకు రూ.5కోట్లు వరకూ ఖర్చు అవుతుందని చెప్పడంతో దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆర్థికంగా ఎవరైనా సహాయం చేయాలనుకుంటే 9603956120, 9063383181 నంబర్లను సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


