నేరడి ప్రాజెక్టుపై చర్చలు | - | Sakshi
Sakshi News home page

నేరడి ప్రాజెక్టుపై చర్చలు

Nov 8 2026 10:24 AM | Updated on Nov 8 2026 10:24 AM

పర్లాకిమిడి: గజపతి జిల్లా కాశీనగర్‌ సమితిలో నేరడి వద్ద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వంశధార నదిపై చేపట్టనున్న బృహత్తర నేరడి ప్రాజెక్టుపై ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య వివాదం నేపఽథ్యంలో శనివారం పర్లాకిమిడి జలవనరుల శాఖ డివిజనల్‌ కార్యాలయంలో ఒక ముఖ్యమైన సమావేశం జరిగినది. ఈ సమావేశానికి ఆంధ్ర, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీరు (భువనేశ్వర్‌) ఆదిత్య శర్మ, శ్రీకాకుళం వంశధార ప్రాజెక్టు ఎస్‌ఈ జి.రామ్‌చరణ్‌రావు, నాగావళి – వంశధార బేసిన్‌ అదనపు చీఫ్‌ ఇంజినీరు (గజపతి) ఎ.రాంప్రసాదరావు, అంతరాష్ట్ర జలవివాద, చీఫ్‌ ఇంజినీర్‌ (భువనేశ్వర్‌) అరుణ్‌ పాల్‌తో పాటు కాశీనగర్‌ బ్లాక్‌లోని బడిగాం, వన్న, గౌరి, పాలసింగి తదితర గ్రామాల నుంచి 16 మంది ప్రతినిధులు హాజరయ్యారు. నేరడి ప్రాజెక్టు వల్ల గజపతి జిల్లా కాశీనగర్‌ సమితిలో 17 గ్రామాలు ముంపునకు గురవుతాయని, వ్యవసాయం, జీవనాధారం, సర్వస్వం కోల్పోతున్నామని వంశధార నేరడి ప్రాజెక్టు కమిటీ సభ్యుడు పూర్ణచంద్ర మహాపాత్రో అన్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు బ్యారేజీ నిర్మాణం వద్ద నష్టం అంచనా, భూమి గుర్తింపు చేపట్టి పరిహారం చెల్లించాలని.. అప్పటివరకు ప్రాజెక్టు తాత్కాలిక నిర్మాణ పనులు చేపట్టరాదని పలువురు ప్రతిపాదించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ అధికారులు ఈ ప్రాజెక్టుకు సంబంధించి అవసరమైన సమాచారం అందించారని కాశీనగర్‌ ప్రాంత ప్రజల ప్రతిపాదనలు ప్రభుత్వానికి తెలియజేసి, తదుపరి చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్‌ జనవనరుల శాఖ చీఫ్‌ ఇంజినీరు తెలియజేశారు. కాగా ఈ చర్చల ఫలితంగా ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ప్రయోజం చేకూర్చేందుకు భవిష్యత్‌లో ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నదే ఆసక్తికరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement