క్షతగాత్రులకు ధర్మాన పరామర్శ | - | Sakshi
Sakshi News home page

క్షతగాత్రులకు ధర్మాన పరామర్శ

Nov 8 2026 10:24 AM | Updated on Nov 8 2026 10:24 AM

శ్రీకాకుళం: గార మండలం శాలిహుండంలో పోలింగ్‌ రోజున టీడీపీ మూకలు దాడి చేయడంతో గాయపడి రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శనివారం పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రిమ్స్‌కు వచ్చిన ఆయన బాధితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యసిబ్బందిని కోరారు. కాగా, బాధితులు నాలుగో అంతస్తు వార్డులో ఉండగా లిఫ్ట్‌ పనిచేయకపోవడంతో ధర్మాన మెట్లు ఎక్కి పైకి వెళ్లారు. లిఫ్ట్‌ కొన్ని రోజులుగా పనిచేయడం లేదని సిబ్బంది చెప్పగా, ఓ సెక్యూరిటీ గార్డ్‌ మాత్రం ప్రస్తుతం కరెంటు పోయిందని చెప్పారు. రోగులకు అసౌకర్యం లేకుండా జనరేటర్‌ ఎందుకు వేయలేదని ధర్మాన ప్రశ్నించగా, మొరాయించిందని చెప్పడం గమనార్హం. కార్యక్రమంలో గార వైఎస్సార్‌ సీపీ నాయకుడు ముంజేటి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement