శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలోని టౌన్ హాలులో స్కూల్ గేమ్స్ జిల్లా స్థాయి ఫెన్సింగ్ ఎంపికలు శనివారం ఆద్యంతం హోరాహోరీగా సాగాయి. అండర్ –14, అండర్–17, అండర్–19 బాలురు, బాలికల విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీలను జిల్లా సెక్రటరీ చల్లా జగదీష్, ఏపీటీఏ ఉపాధ్యక్షుడు తైక్వాండో శ్రీను, ఫెన్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బలభద్రుని రాజా, జిల్లా పీడీ–పీఈటీ సంఘ అధ్యక్షుడు పి.తవిటయ్య సంయుక్తంగా ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా పోటీలో పాల్గొని ప్రతిభను కనబరిచారు. విజేతలను రాష్ట్రపోటీలకు ఎంపికచేశారు. ఈ నెల 21 నుంచి 24 వరకూ ఎన్టీఆర్ జిల్లాలోని పి.గన్నవరం వేదికగా జరగనున్న 70వ ఏపీ రాష్ట్ర స్థాయి స్కూల్‌గేమ్స్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్–2026 పోటీల్లో వీరంతా పాల్గొంటారు. ఎంపికలకు ఎన్‌ఐఎస్ కోచ్ జోగిపాటి వంశీ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. కార్యక్రమంలో బహుజన నేత డాక్టర్ కంఠ వేణు, వైశ్యరాజు మోహన్, లుకలాపు నాగరాజు, పీడీ–పీఈటీ సంఘ జిల్లా అధ్యక్షుడు పి.తవిటయ్య, డి.భవాని, జి.రాహుల్ కుమార్, డి.యశోద, కె.అనిత శ్రీ, బి.పుష్పలత, బి.తులసి, వై.ధనలక్ష్మి, టౌన్ హాల్ ఫెన్సింగ్ కోచ్ హేమంత్ కుమార్ పాల్గొన్నారు.
పోటీలను ప్రారంభిస్తున్న నిర్వాహకులు


