నరసన్నపేట: ఉర్లాం రైల్వేస్టేషన్ వద్ద కోల్‌కతా నుంచి చైన్నె వెళ్తున్న ఎంజీఆర్ చైన్నె సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు సుమారు గంటసేపు నిలిచిపోయింది. ఉదయం 5.30 సమయానికి ఉర్లాం స్టేషన్ వద్దకు వచ్చేసరికి ఇంజన్‌లో సాంకేతిక లోపం ఏర్పడటంతో నిలిపేశారు. మరమ్మతులు అనంతరం తిరిగి బయలుదేరింది.
కౌంటింగ్ కేంద్రాలను
పరిశీలించిన ఎస్పీ
శ్రీకాకుళం క్రైమ్ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలను జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి శనివారం సందర్శించారు. చిలకపాలెం శివానీ ఇంజినీరింగ్ కళాశాల, టెక్కలిలోని ఐతమ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పా టు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో జరుగుతున్న లెక్కింపు ప్రక్రియను, పోలీసుల భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మూడంచెల పటిష్ట భద్రతతో ఎన్నికల లెక్కింపు ప్రక్రియ సజావుగా ప్రశాంతంగా జరిగిందన్నారు.
సురక్షితంగా దీపావళి
శ్రీకాకుళం క్రైమ్ : దీపావళి పండగను ప్రతీ ఒక్కరూ ఆనందోత్సవాలతో, సురక్షిత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆకాంక్షించారు. ప్రమాదాలకు తావులేకుండా పండగను సంప్రదాయబద్ధంగా, కాలుష్యరహితంగా జరుపుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 112, 6309990933 కంట్రో ల్ రూమ్‌కు సమాచారం అందించాలన్నారు.


