పీజీ ప్రవేశ పరీక్షల్లో శ్రీప్రజ్ఞ ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

పీజీ ప్రవేశ పరీక్షల్లో శ్రీప్రజ్ఞ ప్రతిభ

Nov 8 2026 10:24 AM | Updated on Nov 8 2026 10:24 AM

ఆమదాలవలస: మున్సిపాలిటీ ఒకటో వార్డు పరిధి తిమ్మాపురం గ్రామానికి చెందిన మామిడి శ్రీప్రజ్ఞ దేశంలోనే ప్రతిష్టాత్మక వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌(ఇనిసెట్‌) పీజీ ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచింది. జాతీయ స్థాయిలో 346వ ర్యాంకు సాధించింది. శ్రీప్రజ్ఞ ప్రాథమిక విద్య స్థానిక భవిత పాఠశాలలో, ఇంటర్మీడియెట్‌ చైతన్య విద్యా సంస్థల్లో, కాకినాడలోని రంగరాయ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. ఈయన తండ్రి ఎంవీ పార్థసారధి గుత్తావల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బయాలాజికల్‌ టీచర్‌గా పని చేస్తున్నారు. తల్లి పూర్ణ గృహిణి. తన విజయానికి తల్లిదండ్రులతో పాటు గురువులే కారణమని, భవిష్యత్‌లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని శ్రీప్రజ్ఞ తెలిపింది.

జాతీయ పరుగు పోటీలకు సతీష్‌ ఎంపిక

ఆమదాలవలస: చిట్టివలస గ్రామానికి చెందిన సతివాడ సతీష్‌ జాతీయ స్థాయి పరుగు పోటీలకు ఎంపికయ్యా డు. ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న సతీష్‌ ఆంధ్రప్రదేశ్‌ తరఫున మధ్యప్రదేశ్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్‌ శ్యామ్‌సుందర్‌ వెల్లడించారు. సతీష్‌ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడంలో అదే గ్రామానికి చెందిన యువ ట్రైనర్‌ పామల సాయిరాం కీలక పాత్ర పోషించారని తెలిపా డు. గ్రామానికి, కళాశాలకు మంచి పేరు తీసు కొచ్చిన సతీష్‌ను పలువురు అభినందించారు.

సుస్థిర జీవనశైలి అలవర్చుకోవాలి

ఆమదాలవలస : ప్రతిఒక్కరూ సుస్థిర జీవనశైలి అలవర్చుకోవాలని ఆమదాలవలస ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.బాలకృష్ణ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నవంబర్‌ 1 నుంచి 7 వరకు బ్రిక్స్‌ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు నిర్వహించారు. శనివారం జరిగిన ముగింపు కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలో పొడి, తడి, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి వాటి నిర్వహణపై అవగాహన కల్పించారు. వ్యర్థ పదార్థాలతో కళారూపాలు తయారు చేసేలా విద్యార్థులను ప్రోత్సహించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిరోజూ సుస్థిర జీవనశైలి ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement