న్యూస్‌రీల్
శ్రీకాకుళం
బాటలు.. ప్రాణాలతో ఆటలుగిరిజన దారులు ప్రాణాంతకంగా మారాయి. వానలు పడ్డాక రాళ్లు తేలాయి. –8లో
● యథేచ్ఛగా చెరువుల కబ్జా
● కాలువలనూ వదలని టీడీపీ నాయకులు
● పట్టించుకోని అధికారులు
బుధవారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు ఏర్పాట్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఈ నెల 30 నుంచి అక్టోబరు 28 వరకు జరగనున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ప్రథమ విడత పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. డెంటల్ కాలేజీ సర్వీస్ రోడ్డు, సిద్ధిపేట అండర్ పాస్ జంక్షన్ సమీపంలో ఉన్న సహస్ర డిజిటల్ సెంటర్‌ను జిల్లాలో ఏకై క పరీక్షా కేంద్రంగా కేటాయించినట్లు వెల్లడించారు. రోజుకు మూడు విడతల్లో జరిగే ఈ పరీక్షలకు సంబంధించి మొదటి విడత ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, రెండో విడత మధ్యాహ్నం 1.30 నుండి 2.30 గంటల వరకు, మూడో విడత సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. నిర్దేశిత పరీక్ష సమయానికి గంటన్నర ముందుగా లోని కి అనుమతిస్తారు. అభ్యర్థులు నిర్దేశిత సమ యానికి ముందే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఈ పరీక్షల జిల్లా నోడల్ అధికారిగా విద్యాశాఖ సహాయ కమిషనర్ జీపీ చంద్రభూషణరావును నియమించినట్లు, కేంద్రం వద్ద నలుగురు పోలీసులతో భద్రత కల్పించి, తోపులాటలు జరగకుండా చూడాలని ఎస్పీని కోరారు.
రాజీ ద్వారానే కేసులకు శాశ్వత పరిష్కారం
శ్రీకాకుళం పాతబస్టాండ్: కోర్టుల్లో సుదీర్ఘంగా పేరుకుపోయిన సివిల్, క్రిమినల్ కేసులకు మధ్యవర్తిత్వం ద్వారానే త్వరితగతిన శాశ్వత పరిష్కారం లభిస్తుందని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.హరిబాబు స్పష్టం చేశారు. నల్సా, సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ, సయోధ్య ప్రాజెక్టు కమిటీ ఆదేశాల మేరకు అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు 90 రోజుల పాటు నిర్వహించనున్న ‘మీడియేషన్ ఫర్ ది నేషన్ క్యాంపెయిన్ 3.0’ ప్రత్యేక ప్రచారంపై మంగళవారం ఆయన అధ్యక్షతన న్యాయవాదులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో నిర్వహించిన మొదటి, రెండో విడత క్యాంపెయిన్లలో జిల్లా మంచి ఫలితాలు సాధించిందని, ఈ మూడో విడతలో అంతకుమించి గరిష్ట సంఖ్యలో కేసులను పరిష్కరించి శ్రీకాకుళం జిల్లాను ముందంజలో ఉంచాలని పిలుపునిచ్చారు. రాజీ విధానంలో కేసులు పరిష్కరించుకోవడం వల్ల సమయంతో పాటు ధనం ఆదా అవుతుందని, చెల్లించిన కోర్టు ఫీజు కూడా తిరిగి వస్తుందని హరిబాబు వివరించారు. వివరాలకు 15100 టోల్ ఫ్రీ నంబరును సంప్రదించాలని కోరారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
నరసన్నపేట నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు బరితెగించేశారు. కళ్ల ముందు అక్రమాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఒకవైపు మందుబాబులను దోచేస్తున్నారు. మరోవైపు ఎక్కడికక్కడ ఇసుక మింగేస్తున్నారు. ఇంకోవైపు ప్రభుత్వ స్థలాలు, చెరువులు కబ్జా చేసేస్తున్నారు. తెలుగు తమ్ముళ్లు ఎక్కడా తగ్గడం లేదు. దోపిడీకి లైసెన్స్ ఇచ్చినట్టు చెలరేగిపోతున్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ చెరువులు ఆక్రమించేస్తున్నారు. దర్జాగా చదును చేసి సొమ్ము చేసుకుంటున్నారు.
నియోజకవర్గ కీలక నేతల కనుసన్నల్లోనే అక్రమాలు జరుగుతున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయిన టీడీపీ నాయకులు ఎవరికి వారు దొరికిన కాడికి దోచుకుంటున్నారు. కబ్జాలకు పాల్పడుతున్నారు. జిల్లా పెద్ద నేత వర్గమంటూ కొందరు, నియోజకవర్గ పెద్ద నేత వర్గమంటూ మరికొందరు బరితెగించేసి దందాలు సాగిస్తున్నారు. మద్యం దుకాణాలన్నీ టీడీపీ నాయకుల చేతిలో ఉండటంతో క్వార్టర్ బాటిల్‌పై రూ. 20నుంచి రూ.50కు పెంచి విక్రయిస్తున్నారు. తద్వారా వచ్చే సొమ్మును పంచుకుంటున్నారు. ఇసుకను సైతం అదే విధంగా దోచేస్తున్నారు. ఎవరి పరిధిలో వారు చెలరేగిపోయి ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టి, అక్రమ రవాణా సాగిస్తున్నారు. పైసా పెట్టుబడి లేకుండా రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రభుత్వ స్థలాలు, చెరువుల ఆక్రమణలకై తే అడ్డు అదుపూ లేదు. ముఖ్యంగా చెరువులను కళ్లముందే కబ్జా చేసి, చదును చేసి అనుభవిస్తున్నారు. కొన్నిచోట్లయితే అమ్ముకుంటున్నారు. ఇటీవల రాజుల చెరువు, నరసన్న చెరువు, రాతికర్ర చెరువు, పాలకర్ర చెరువు ఆక్రమణల బాగోతం నియోజకవర్గమంతా గగ్గోలు పెడుతోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కబ్జా రాయళ్లు రెచ్చిపోయి చెరువులను ఆక్రమిస్తున్నారు. తాజాగా సత్యవరం పరిధిలోని సర్వే నంబర్ 412/4లో గల 1.55 ఎకరాల విస్తీర్ణం గల వట్టి బసవన్న చెరువును కళ్లముందే చదును చేసి, కబ్జా చేసేస్తున్నారు. జేసీబీతో చెరువును చదును చేయడమే కాకుండా ఆ చెరువుకు మురుగునీరు, వర్షపు నీరు వచ్చే డ్రైన్ మార్గాన్ని కప్పేశారు. కళ్లముందే ఇదంతా జరుగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు.
పలాస–కాశీబుగ్గ ప్రాంతంలో గంజాయి గుప్పుమంటోంది. రెండు వారాల కిందట పర్లాఖిముండి నుంచి విజయవాడకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్న ఇద్దరిని పట్టుకున్న పోలీసులు, మంగళవారం ఓ మహిళ నుంచి 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పలాస రైల్వే స్టేషన్‌లో ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాయి. ఆ సమయంలో రెండో నంబరు ప్లా ట్ ఫారంలో ఓ మహిళ అనుమానాస్పదంగా సంచరించడాన్ని పోలీసులు గమనించారు. ఆమెను అదుపులోకి తీసుకుని, రెండు బ్యాగులను తనిఖీ చేయగా 11 కిలోల గంజాయి బయటపడింది. గంజాయి కలిగిన మహిళను పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన నౌబహార్ బీబీ (34)గా గుర్తించారు. రైల్వే ఎస్‌ఐ దుంపల శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. – కాశీబుగ్గ
వరద తగ్గింది.. బురద మిగిలింది
బూర్జ మండలంలో ఇటీవల తుఫాన్ తాకిడికి నాగావళి ఉగ్రరూపం దాల్చి చేలు నీటమునిగిన విషం తెలిసిందే. నీరు తగ్గినప్పటికి వరి చేలుపైన ఏటి బురద మట్టి పట్టడంతో వరి పంట కుళ్లిపోతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. – బూర్జ
నరసన్నపేట మండలం సత్యవరం రెవెన్యూ పరిధిలోని 412/4లో గల వట్టి బసవన్న చెరువును జేసీబీ ద్వారా పట్టపగలు చదును చేస్తున్న దృశ్యమిది. ఎకరా 55 సెంట్లు విస్తీర్ణం గల ఈ చెరువు ప్రభుత్వ రికార్డుల్లో ప్రభుత్వ పోరంబోకుగా ఉంది. అయినప్పటికీ అక్రమంగా చదును చేసి, ఆక్రమిస్తున్నారు.
నరసన్నపేట టౌన్ నుంచి వట్టి బసవన్న చెరువుకు వెళ్లేందుకు నిర్మించిన డ్రైన్‌ను అక్రమంగా కప్పేసిన దృశ్యమిది. టౌన్‌కు చెందిన వర్షపు నీరు, మురుగు నీరు వెళ్లేందుకు రూ. 30లక్షలతో ప్రత్యేక డ్రైన్ నిర్మించారు. ఈ డ్రైన్ ద్వారా చెరువులోకి మురుగు నీరు, వర్షపు నీరు వెళ్తుంది. దీనికి ప్రస్తుతం కప్పేయడంతో వర్షం పడితే డ్రైన్‌లో నీరు వెళ్లే పరిస్థితి ఉండదు. ఫలితంగా నరసన్నపేట టౌన్ మరింత ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది.


