స్థానిక సంస్థల్లో విజయ పతాకం ఎగరేద్దాం | - | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల్లో విజయ పతాకం ఎగరేద్దాం

Sep 30 2026 1:34 AM | Updated on Sep 30 2026 1:34 AM

● పార్టీకి బద్ధులై పనిచేయడమే

విజయవంతమైన పాలన

●మాజీ జెడ్పీటీసీ, ఎంపీపీల అభినందన సభలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వైఎస్సార్‌ సీపీ హయాంలో 2021లో జెడ్పీటీసీలు, ఎంపీపీలుగా ఎన్నికై న వారు ఐదేళ్ల పాటు ఎలాంటి మచ్చ లేకుండా పాలించారని మాజీ మంత్రి ధర్మా న ప్రసాదరావు అన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ జెండా ఎగరేద్దామని ఆయన పిలుపునిచ్చారు. పదవీ కా లం పూర్తి చేసిన ఎంపీపీలు, జెడ్పీటీసీలకు మాజీ ఎంపీపీ అంబటి శ్రీనివాసరావు అధ్యక్షతన మంగళవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ శ్రీకాకుళం నియోజకవర్గంలో 1952 నుంచి 2024 వరకు సుమారు 70 ఏళ్లుగా పాలించినవారంతా నిజాయితీగా ఉన్నారని, సొంత ఆస్తు లు అమ్ముకుని పాలించి ప్రజల మన్ననలు పొందారన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్న గొండు శంకర్‌ ఇసుక, మట్టి, గ్రావెల్‌ వంటివి అమ్ముకుని కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌లు నేర్పించిన దోచుకో...దాచుకో అనే సిద్ధాంతాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు పాటిస్తున్నారని దుయ్యబట్టారు. కూటమి నేతల అబద్ధాలను నిజాలుగా చూపించేందుకు ఇన్‌ఫ్లుయెన్సర్లకు రూ.15 వేలు జీతం ఇస్తున్నారని మండిపడ్డారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఉత్తరాంధ్రకు ఒక్క చెప్పుకోదగ్గ ప్రాజెక్టు అయినా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్‌లకు కేవలం తన కులానికి చెందినవారికి లాభం చేకూర్చడమే తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు వారికి ఏ మా త్రం పట్టవన్నారు. కేంద్ర ప్రభుత్వం, విభజన కమిటీ, వైఎస్సార్‌సీపీ వంటి పార్టీలన్నీ అమరావతిలో రాజధాని కరెక్ట్‌ కాదు చిన్న వర్షం కురిసినా మునిగిపోతోందని చెప్పినా చంద్రబాబు వినలేదన్నారు. అమరావతికి వెళ్లాలంటే మనందరం ఈత నేర్చుకోవాలని, పడవలు కొనుక్కోవాలన్నా రు. ఇచ్ఛాపురం, పలాస, ఆమదాలవలస, శ్రీకాకుళం మున్సిపాలిటీల్లో 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతాయని అన్నిచోట్లా అభ్యర్థుల్ని నిలబెట్టి గెలిపిస్తే గౌరవం పెరుగుతుందన్నారు.

● పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదురైనా ప్రజల పట్ల బా ధ్యతతో తమ పదవులను నిర్వర్తించిన ఎంపీపీలు, జెడ్పీటీసీలను అభినందించారు. ప్రజా సేవలో వారు సంపాదించిన అనుభవం, ప్రదర్శించిన అంకితభావం భవిష్యత్‌లో మరింతగా ఉపయోగపడాలని ఆకాంక్షించారు.

● జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌ పర్సన్‌ పిరియా విజయసాయిరాజ్‌ మాట్లాడుతూ తాను జెడ్పీటీసీగా మాత్రమే అనుకున్నానని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దయవల్ల ఏకంగా జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ పదవి వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వ వచ్చాక అనేక ఇబ్బందులు పెట్టినప్పటికి వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలు సభలు, సమావేశాల్లో ఉండటం దిగ్విజయంగా పదవీ కాలాన్ని పూర్తిచేసుకోగలిగానన్నారు.

● పోలాకి జెడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్య, జిల్లాపరిషత్‌ జిల్లా ఉపాధ్యక్షురాలు పాలిన శ్రావణి, ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, డిజిటల్‌ బుక్‌ సభ్యులు నర్తు నరేంద్రయాదవ్‌లతో పాటు ఎంపీపీలు, జెడ్పీటీసీలు మా ట్లాడుతూ పదవులు ముఖ్యం కాదని, పార్టీ చాలా ముఖ్యమని మా పదవుల్ని విజయవంతంగా పూర్తిచేసుకునేందుకు సహకరించిన ప్రజలందరికి కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌, పార్టీ రాష్ట్ర సీఈసీ మెంబర్‌ అంధవరపు సూరిబాబు, మున్సిపల్‌ మా జీ చైర్‌ పర్సన్‌ ఎంవీ పద్మావతి, రాష్ట్రకార్యదర్శులు, నియోజకవర్గాల పరిశీలకులు ఎన్ని ధనుంజయరావు, చల్ల రవికుమార్‌, పిన్నింటి సాయికుమార్‌, జిల్లాప్రధానకార్యదర్శి గేదెల పురుషోత్తం, డిజిటల్‌ బుక్‌ చైర్మన్‌ శిమ్మ రాజశేఖర్‌, ఉలాల దివ్యభారతి, ముత్తా విజయ్‌కుమార్‌, మార్పు పృథ్వీ, కోణార్క్‌ శ్రీను, ఎం.ఏ భేగ్‌, దువ్వాడ వాణి, గొండు రఘు రాం, మూకళ్ల తాతబాబు, సాధు వైకుంఠరావు, పాలిన శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement