శ్రీకాకుళం: విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతర పోరాటాలు నిర్వహిస్తామని ఎస్‌ఎఫ్‌ఐ ఆల్ ఇండియా అధ్యక్షుడు ఆదర్శ్ ఎం.సాజీ అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీకాకుళం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ‘జెన్–జెడ్ సెమినార్’ నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు డి.చందు అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాజీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ‘స్కూల్ బచావో’ ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామమోహన్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై భవిష్యత్తులో మరింత కేంద్రీకృతంగా పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఇటీవల టెక్కలి మండలం రావివలస సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో నలుగురు ఇంటర్మీడియట్ విద్యార్థులు మృతి చెందడం తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి.ఖగేష్, బాలికల కన్వీనర్ పి.దివ్య, జిల్లా కమిటీ సభ్యులు మురళి, జగన్, దివాకర్, వందన, కీర్తి, ధరణి, పార్ధు, హేమంత్, కార్తీక్, అజిత్ పాల్గొన్నారు.


