బడిలో బెదిరింపుల పర్వం | - | Sakshi
Sakshi News home page

బడిలో బెదిరింపుల పర్వం

Sep 30 2026 1:34 AM | Updated on Sep 30 2026 1:34 AM

దారుణం

ఎస్‌ఎంసీ ఎన్నికల్లో నాకు 5 ఓట్లు పడ్డాయి. ఇతరులకు 7 ఓట్లు పడ్డాయి. నేను ప్రమాణ స్వీకారం కూడా చేశాను. కానీ మధ్యాహ్నం అయ్యేసరికి ఎన్నిక వాయిదా పడిందని హెచ్‌ఎం తెలిపారు. నేను సంతకం చేసిన ఎస్‌ ఎంసీ పత్రం అడిగినా ఇవ్వలేదు. ఇది దారుణం.

– మజ్జి పాపారావు, అంబుగాం జెడ్పీహెచ్‌ఎస్‌లో ఎస్‌ఎంసీ చైర్మన్‌గా గెలిచిన వ్యక్తి

ఉదయం నుంచి నిరీక్షించాం

పాఠశాలలో ఎస్‌ఎంసీ ఎన్నికలు అని చెబితే వచ్చాం. ఉదయం 7 గంటల నుంచి నిరీక్షించాం. నాతో పాటు సుమారు 18 మంది సభ్యులు కోరం సభ్యులుగా ఉన్నప్పటికీ ఎన్నికలు నిర్వహించలేదు. చివరకు వాయిదా వేసేశారు.

– వి.దాసునాయుడు, విద్యార్థి తండ్రి,

దంత గ్రామం, కోటబొమ్మాళి మండలం

టీడీపీ ప్రభుత్వంపైన, స్థానిక ఎమ్మెల్యేపైన ఎంత వ్యతిరేకత ఉందో తెలియజేసే సాక్ష్యమిది. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ సొంత మండలమైన పొందూరు మండలం కోటిపల్లి, మజ్జిలిపేట స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ ఎన్నికలను విద్యార్థుల తల్లిదండ్రులు బహిష్కరించారు. ఎమ్మెల్యే కూన రవికుమార్‌ గెలిచి రెండున్నర సంవత్సరాలైనా పాఠశాల అభివృద్ధిని గాని, గ్రామ అభివృద్ధిని గాని పట్టించుకోలేదని వీరంతా ఎన్నికలను బహిష్కరించారు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఎన్నికల్లో టీడీపీ అడ్డదారులు తొక్కింది. ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనబడటంతో అధికార యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకుని, బెదిరింపులతో గెలవాలని చూసింది. అయినప్పటికీ చాలా చోట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురుతిరిగారు. ఎంత భయపెట్టినా వెరవకుండా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను గెలిపించారు. ఎన్ని చేసినా గెలవలేకపోతున్నామన్న అక్కసుతో అధికారులపై టీడీపీ నాయకులు ఒత్తిడి చేసి, ఎన్నికలను రద్దు చేయడం, వాయిదా వేయించడం వంటివి చేశారు.

రాజకీయాలకు సంబంధం లేని ఎస్‌ఎంసీ ఎన్నికలను సైతం టీడీపీ నాయకుల సాధారణ ఎన్నికల మాదిరిగానే తీసుకున్నారు. కానీ వారి కుయుక్తులను విద్యార్థుల తల్లిదండ్రులు తిప్పికొట్టారు. తమకు కావాల్సిన వారిని గెలిపించుకున్నారు. ఇంత ఉద్రిక్తలు, భయాందోళనలు, బెదిరింపుల మధ్య వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెలిచారంటే అధికార పార్టీపై ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమైంది. ఆఖరికి చేసేదేమీ లేక టీడీపీ నాయకులు గెలిచిన వాళ్లను తమవాళ్లే అని చెప్పుకోవాల్సి వచ్చింది. దాదాపు ఎన్నికలన్నీ ఆ పార్టీ నాయకుల సమక్షంలోనే జరిగాయి.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడు సొంత మండలం కోటబొమ్మాళి మండలం మాసాహెచ్‌పేట పంచాయతీ పరిధిలోని కమలనాభపురం ప్రాధమిక పాఠశాల మేనేజ్‌మెంట్‌ కమి టీకిజరిగిన ఎన్నికల్లో టీడీపీమద్దతుదారుడికి ఒక్కరూ ఓటు వేయలేదు. పాఠశాలలో 8 ఓట్లకు గాను వైఎస్సార్‌సీపీ మద్దతుదారు బగాది ఉషాకి సభ్యులంతా మద్దతు పలికారు. అధికార పార్టీకి చెందిన మద్దతుదారు బర్ల రాముకు ఒక్కరూ మద్దతు పలకలేదు.

టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి మండలం దంత ప్రాథమికోన్నత పాఠశాల మేనేజ్‌మెంట్‌ కమిటీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు అధికార దర్పం ప్రదర్శించారు. 30 మంది ఓటర్లకు గాను 19మంది ఓటర్లు వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులుగా ఉండటంతో టీడీపీ ఏకగ్రీవ ప్రయత్నాలు సాగలేదు. ఒత్తిళ్లు, బెదిరింపులకు దిగినప్పటికీ లెక్క చేయలేదు. ఎలాగైనా ఏకగ్రీవం చేసుకుందామని కుట్రలు పన్నినా పారకపోవడంతో అధికారుల ద్వారా చివరికీ వాయిదా వేయించారు.

కొర్లకోట గ్రామంలో పోస్ట్‌ మాస్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సనపల అప్పలనాయుడు అనే వ్యక్తి, విధి నిర్వహణలో ఉన్న సమయంలోనే నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలకు చేరుకున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. మైక్‌ పట్టుకుని ఎవరు ఏం చేయాలో ఆదేశించారని ఆరోపించారు.

సారవకోట మండలంలోని సారవకోట, అలుదు, చిన్నకిట్టాలపాడు పాఠశాలల్లో టీడీపీ నాయకులు తరగతి గదుల్లోనే తిష్ట వేసుకుని కూర్చున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో బయటకు వెళ్లారు.

మందస మండలం పొత్తంగిలో ఫలితాలు తమకు అనుకూలంగారాలేదని ఎన్నికను వాయిదావేశారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

కోటబొమ్మాళి మండలం నీలంపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తాము అనుకున్నది జరగలేదని అధికార పార్టీ మద్దతుదారులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఏకంగా తీర్మానం పుస్తకాలను చించివేసి రణరంగం సృష్టించారు. అయితే పోలీసులు చేరుకున్నప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. చివరకు ఎన్నికను వాయిదా వేశారు.

మందస మండలం అంబుగాం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మజ్జి పాపారావు చైర్మన్‌గా ఎంపికయ్యారు. ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. కానీ మధ్యాహ్నం దాటాక హెచ్‌ఎం వచ్చి ఎన్నిక వాయిదా పడిందని చెప్పారు. కూటమి నాయకులు గెలవలేదని కుట్రతో ఎన్నిక రద్దు చేశారని చైర్మన్‌ పాపారావు తెలిపారు.

ఎస్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ పిల్లిమొగ్గలు

గెలుపు కోసం అడ్డదారులు

స్కూల్‌ ఎన్నికల్లోనూ బెదిరింపులు, ప్రలోభాలు

గెలవని చోట అధికార జులుం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement