శ్రీకాకుళం పాతబస్టాండ్: బంగాళాఖాతంలో తీవ్ర అల్ప పీడనం తుఫాన్‌గా మారనున్న సందర్భంగా సోమవారం నుంచి జిల్లాలో వర్షా లు, గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు అధికా రులు ఓ ప్రకటన విడుదల చేశారు. అల్ప పీడనం సోమవారం బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మంగళవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందంటున్నారు. బుధవారం నాటికి ఉత్తర ఆంధ్రప్రదేశ్–దక్షిణ ఒడిశా తీరాల సమీపానికి వస్తుందని తెలిపారు. దీని ప్రభావంతో సోమవారం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురి సే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవింవవచ్చని తెలిపారు.


