● మెళియాపుట్టిలో కోతుల దాడిలో 42 మందికి గాయాలు
● స్థానిక పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న బాధితులు
● పట్టించుకోని అధికారులు
● వీధుల్లో విచ్చలవిడిగా తిరుగుతూ దాడులు చేస్తున్న కోతులు
మెళియాపుట్టి: మండలం కేంద్రాన్ని కోతులు స్వాధీనంలోకి తెచ్చుకున్నట్టు ఉన్నాయి. విచ్చలవిడిగా వీధుల్లో తిరుగుతూ దాడులకు తెగబడుతున్నాయి. ఇప్పటివరకు కోతుల దాడిలో గాయాలపాలై స్థానిక పీహెచ్‌సీలో 42 మంది చికిత్స పొందినట్లు వైద్యశాఖ సిబ్బంది తెలియజేశారు. ఇంకా ఆస్పత్రుల్లో చేరిన వారితో కలిపితే 100 మంది వరకు గాయపడి ఉంటారని అంచనా. ఇంత జరుగుతున్నా ఫారెస్ట్ అధికారుల్లో చలనం లేదు. ఎవరో వస్తే పట్టుకుంటామని వారు చెబుతున్నారు. అధికారుల్లో సమన్వయం లేకపోవడంతో అమాయక ప్రజలు దాడులకు గురవుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


