వాయుగుండంపై విద్యుత్‌ శాఖ అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

వాయుగుండంపై విద్యుత్‌ శాఖ అప్రమత్తం

Sep 21 2026 12:26 AM | Updated on Sep 21 2026 12:26 AM

అరసవల్లి:

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం జిల్లా తీర ప్రాంతంపై పడుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్‌ శాఖ తరఫున అప్రమత్తంగా ఉన్నామని విద్యుత్‌ శాఖ సర్కిల్‌ ఎస్‌ఈ జీఎన్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ వాతావరణంలో మార్పుల కారణంగా వాయుగుండంగా తీవ్ర ప్రభా వం చూపుతుందని ఉన్నతాధికారుల సూచనల మేరకు జిల్లాలో శ్రీకాకుళం, పలాస, టెక్కలి డివిజన్ల పరిధిలో అన్ని తీర ప్రాంతాల్లో అలెర్ట్‌ చేశామన్నారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లోని 11 మండలాల్లో భారీ వర్షాలు, గాలులు వీచే అవకాశాలు ఉన్నట్లుగా అందుతున్న సమాచారం మేరకు సిబ్బందిని ప్రత్యేకంగా సెక్షన్ల వారీగా నియమించామన్నారు. అలాగే సర్కిల్‌ పరిధిలో అన్ని హోదాల్లో విద్యుత్‌ శాఖ ఉద్యోగులు, ఇంజినీరింగ్‌ అధికారులకు సెలవులను రద్దు చేసినట్లుగా ప్రకటించారు. తుఫాన్‌ తీవ్రతను బట్టి విద్యు త్‌ శాఖకు నష్టం వాటిల్లితే, యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ పునరుద్ధరణ పనులను చేపట్టేలా చర్యలు చేపడుతున్నట్లుగా వివరించారు. ఇందుకోసం మొత్తం 1500 విద్యుత్‌ స్తంభాలు, 15 కిలోమీటర్ల మేర కండక్టర్లు, మేచింగ్‌ మెటీరియల్స్‌, 2 వేల మంది ఓఅండ్‌ఎం స్టాఫ్‌ను సిద్ధం చేశామన్నారు. 36 సెక్షన్లలో 10 మంది కాంట్రాక్టర్‌ సిబ్బందిని నియమించి తదుపరి చర్యలకు ఆదేశించినట్లుగా ప్రకటించారు. జిల్లా కేంద్రంలోనూ అలాగే డివిజన్‌ కేంద్రాల్లోనూ కాల్‌సెంటర్‌/ మానిటరింగ్‌ సెల్‌ను పెట్టి ఎప్పటికప్పుడు వివరాలను సేకరిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement