న్యూస్‌రీల్
వివరాలు చెబితేనే
రాయితీ వరాలు
ఈకేవైసీ చేసుకోకపోతే గ్యాస్ కనెక్షన్ బ్లాక్
గ్యాస్ కంపెనీలకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశాలు
ఎన్ని సార్లు గడువు ఇచ్చినా చేసుకోకపోవడంతో కేంద్రం
ఆంక్షలు
ఈకేవైసీ చేసుకున్న తర్వాతే కనెక్షన్ పునరుద్ధరణ
వినాయక.. సెలవికవినాయక నిమజ్జనాలు ఘనంగా జరిగాయి. భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. –8లో
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
మీ గ్యాస్ కనెక్షన్‌కు ఈకేవైసీ చేసుకోలేదా..? అయితే మీ కనెక్షన్ బ్లాక్ అయిపోయినట్టే. ఇకపై మీకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ రాదు. బుక్ చేసినా తీసుకోదు. ఎంత చెబుతున్నా బయో మెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ(బీఏఏ) పూర్తి చేయని డొమెస్టిక్ ఎల్‌పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. బీఏఏ చేసేంతవరకు సబ్సిడీ, నియంత్రిత ధరకు గ్యాస్ ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ కంపెనీలకు ఈనెల 17వ తేదీన కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్ వినియోగదారులంతా ఈకేవైసీ చేసుకోవాలని గత ఏడాది ఫిబ్రవరి నుంచి కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా చెబుతూ వస్తోంది. కానీ, చాలా మంది వినియోగదారులకు బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ చేసుకోవడం లేదు. గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగం జరుగుతున్న దృష్ట్యా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం అమలు చేయకపోవడంతో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున భారం పడుతోంది. ఎన్ని సార్లు గడువు పెంచినా చాలా మంది వినియోగదారులు ఈకేవైసీ చేసుకోకపోవడంతో కేంద్రం సీరియస్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని కంపెనీలకు సంబంధించి సుమారు 18లక్షల గ్యాస్ కనెక్షన్లు బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ చేసుకోలేదని విశ్వసనీయ సమాచారం. అదే స్థాయిలో జిల్లాలో కూడా వేలాదిగా వినియోగదారులు కేంద్రం ఆదేశాలను పట్టించుకోలేదు.
వినియోగదారుల్లో స్పందన లేకపోవడంతో గ్యాస్ రీఫిల్‌పై ఆంక్షలు విధించింది. బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ చేయని గ్యాస్ కనెక్షన్లను బ్లాక్‌లో పెడతామని స్పష్టం చేసింది. బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ చేసుకోనంతవరకు సబ్సిడీ, నియంత్రిత ధరకు గ్యాస్ బుకింగ్ జరగదు. వారంతా బయట మార్కెట్‌లో నిర్ణయించే ధరకు గ్యాస్ కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. ఎవరైతే వెంటనే బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ చేసుకుంటారో ఆ తర్వాత కనెక్షన్ యాక్టివేషన్ చేసి, సబ్సిడీ, నియంత్రిత ధరకు సిలిండర్లను సరఫరా చేస్తారు.


