రైతులను ఆదుకోవడంలో | - | Sakshi
Sakshi News home page

రైతులను ఆదుకోవడంలో

Sep 20 2026 12:21 AM | Updated on Sep 20 2026 12:21 AM

రైతులను ఆదుకోవడంలో ● వెంటనే కరువు మండలాలను ప్రకటించాలి ● ప్రతి రైతుకు రూ.25వేలు చొప్పున చెల్లించాలి ● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ ప్రభుత్వం విఫలం

● వెంటనే కరువు మండలాలను ప్రకటించాలి ● ప్రతి రైతుకు రూ.25వేలు చొప్పున చెల్లించాలి ● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌

నరసన్నపేట: మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో రైతులు నట్టేట మునుగుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నా రు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆయన విలేకరులతో మా ట్లాడారు. రాష్ట్రంలో ఉన్నది ఎల్‌నినో ఎఫెక్టు కాదని ఎల్లో నినో ఎఫెక్టు అని కృష్ణదాస్‌ ఎద్దేవా చేశారు. తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నా సీఎం చంద్రబాబు గానీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గానీ తగిన విధంగా స్పందించడం లేదని విమర్శించారు. ఎల్‌నినో ప్రభావంపై ఫిబ్రవరి 4 వ తేదీనే ముఖ్యమంత్రి ప్రకటన చేశారని, అయితే దీనికి తగ్గట్టు రైతులకు తగు సూచనలు చేయడంలో, ముందస్తు ప్రణాళిక రూపొందించడంలో, తగిన విధంగా సహాయ పడటంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. చంద్రబాబు.. కరువు కవలలు అని ఎద్దేవా చేశారు.

కరువు మండలాలుగా ప్రకటించాలి..

వర్షపాతం లోటు స్పష్టంగా కనిపిస్తోందని,జిల్లాలో ఉన్న 30 మండలాలను వెంటనే కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఉచిత పంటల బీమా పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో ఉచిత పంటల బీమా ఉంటే రైతులకు ఎంతో మేలు జరిగేదని అన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని కోరారు. ఇప్పటి వరకూ బీమా చెల్లించిన రైతులకు బీమా ప్రీమియం తిరిగి చెల్లించాలని కోరారు. అలాగే రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం దారుణంగా విలఫమైందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement