వ్యవస్థల్ని నాశనం చేసిన ఘనత బాబుదే | - | Sakshi
Sakshi News home page

వ్యవస్థల్ని నాశనం చేసిన ఘనత బాబుదే

Sep 19 2026 8:38 AM | Updated on Sep 19 2026 8:38 AM

● తీవ్రంగా విమర్శించిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

● ‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటుదాం

● ఇచ్ఛాపురం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పిలుపునిచ్చిన పార్టీ సీనియర్‌ నేతలు

కంచిలి, కవిటి, సోంపేట: చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. సోంపేట పట్టణంలో వీబీఆర్‌ కళ్యాణ మండపం ఆవరణలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ఇచ్ఛాపురం నియోజకవర్గం విస్తృత స్థాయి వైఎస్సార్‌ సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైఎస్‌ జగన్‌ పాలనలో గ్రామ స్వరాజ్యం కల సాకారమైతే.. కూటమి పాలన వాటిని నిస్తేజపరిచిందన్నారు. ఎరువుల బస్తా వెయ్యి రూపాయలకు కొను గోలు చేసే దిక్కుమాలిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడిందని ఎద్దేవా చేశారు. డీఎస్సీలో అక్రమాలు జరుగుతున్నాయని, రూ.13 లక్షలు కోట్లు అప్పు చేసి ఖర్చుచేశారని, క్షేత్రస్థాయిలో మాత్రం అభివృద్ధి జరగలేదని, ఇచ్ఛాపురంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయంతో చంద్రబాబుకు గట్టిగా గుణపాఠం చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. జిల్లాలో వైఎస్సార్‌, వైఎస్‌ జగన్‌ హయాంలలో మాత్రమే అభివృద్ధి పనులు జరిగాయని గుర్తు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, సూపర్‌ సిక్స్‌ పథకాలంటూ ప్రజల్లోకి వచ్చి కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీ ని పూర్తిస్థాయిలో నిలబెట్టుకోలేదని ఆరోపించారు. మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ కూటమి పాలనకు చరమగీతం పాడుదామని పిలుపునిచ్చారు. పార్టీ సూచించిన అభ్యర్థినే గెలుపించుకుని మరోసారి వైఎస్సార్‌ సీపీ సత్తా చాటుదామన్నారు.

ఎమ్మెల్సీ, జిల్లా పరిశీలకుడు కుంభా రవిబాబు మా ట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశా రని ఆరోపించారు. ఇచ్ఛాపురం నియోజవవర్గంలో మూడుసార్లు గెలిచిన ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement