టెక్కలి : యూత్ ఫర్ వికసిత్ భారత్ – యూత్ విజన్ ఫర్ ఎ డెవలప్‌డ్ ఇండియా ఆధ్వర్యంలో యువ ఉత్సవంలో ఇటీవల ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన క్విజ్ పోటీల్లో టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విద్యార్థులను అభినందించారు. కొలుసు సాయి వెంకట్ సన్నిహిత్, చల్లా సాయి స్వరూప్, చిలక ప్రవళ్లిక, మొగిలి వినయ్, గార దీపక్, సిమ్మ డిల్లేశ్వరి, జనపాన తరుణ్, జి.రితీషా, పవన్, పి.సమీర, పైడిశెట్టి జ్యోత్స్న, కొంచాడ వినయ్ తదితరులు గ్రూప్ క్విజ్‌లో ప్రథమ స్థానం, తృతీయ స్థానంతో పాటు ఆన్‌లైన్ క్విజ్‌లో ద్వితీయ స్థానం సాధించారు.


