రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

Sep 9 2026 3:28 AM | Updated on Sep 9 2026 3:28 AM

టెక్కలి రూరల్‌: టెక్కలిలోని శంబానవీధికి చెందిన డొక్కర మాధవరావు(28) అనే యువకుడు రైలు కింద తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాధవరావు సోమవారం రాత్రి తన కుటుంబంలో వచ్చిన చిన్నపాటి తగాదాకు మనస్థాపానికి గురై ఇంటి నుంచి బయటకు వెల్లిపోయాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతుకుతుండగా అర్థరాత్రి సమయంలో కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రాపురం, దండుగోపాలపురం రైల్వే లైన్‌ మధ్య గుర్తు తెలియని యువకుడు రైలు కింద తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం తెలుకున్నారు. వెంటనే స్నేహితులు, రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం నుంచి తల వేరైపోవడంతో చాలా సమయం వెతకగా చివరకు గుర్తించి మృతుడు మాధవరావుగా గుర్తించారు. అనంతరం రైల్వే పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని శవపంచనామ నిమిత్తం టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మంగళవారం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందించారు. మాధవరావుకు ఏడాది కిందట కోటబొమ్మాళి మండలం జమ్మచక్రం గ్రామానికి చెందిన పల్లవి అనే మహిళతో వివాహం జరిగింది. ఓ పెయింటింగ్‌ కంపెనీలో పనిచేస్తూ ఈ నెల 6నే పుట్టినరోజు వేడుకలు సైతం నిర్వహించుకున్నాడు. ఇంతలో ఏమైందో తెలియదు గాని మాధవరావు తీసుకున్న నిర్ణయంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement