ట్రాన్స్‌ఫార్మర్లు చోరీ | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ఫార్మర్లు చోరీ

Sep 9 2026 3:28 AM | Updated on Sep 9 2026 3:28 AM

హిరమండలం: ఎల్‌ఎన్‌పేట మండలం చొర్లంగి పంచాయతీ బాలేరు గిరిజన గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. అర్ధరాత్రి విద్యుత్‌ సరఫరా నిలిపివేసి పొలంలో ఉన్న రెండు ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి రాగి చోరీ చేశారు. ఉదయం రైతులు పొలాల్లోకి వెళ్లగా ఈ విషయం గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. పాతపట్నం డీఈఈ ప్రసాదరావు, ఏఈ వెంకటేశ్వర్లు వెంటనే సరుబుజ్జిలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఇదే పంచాయతీలో ఇటీవల ఆరు ట్రాన్స్‌ఫార్మర్లను చోరీ చేసి రాగిని దొంగిలించుకుపోయారు. నెల రోజుల పరిధిలో 8 ట్రాన్స్‌ఫార్మర్లలో దొంగతనం జరగడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement