రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

Sep 9 2026 3:28 AM | Updated on Sep 9 2026 3:28 AM

టెక్కలి రూరల్‌: రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో టెక్కలి ఎన్టీఆర్‌ క్రీడావీకాస్‌ కేంద్రానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు కోచ్‌ నర్శిపురం శేఖర్‌ మంగళవారం తెలిపారు. ఈ నెల 5, 6వ తేదీలలో గుంటూరు జిల్లా తెనాలిలో జెఎంజె ఉమెన్స్‌ కళాశాలలో జరిగిన 5వ సబ్‌ జూనియర్స్‌, 3వ కిడ్స్‌ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో టెక్కలి విద్యార్థులు గోల్డ్‌ మెడల్‌ సాధించారు. సబ్‌ జూనియర్‌ బ్లాక్‌ బెల్ట్‌ బాలురు విభాగంలో తమిరి జ్ఞానదీప్‌ స్వర్ణ పతకం సాధించగా, కలర్‌ బెల్ట్‌ విభాగంలో ఎల్‌.సాయిరామ్‌, బి.ఈశ్వర్‌కుమార్‌లు స్వర్ణ పతకాలు కై వసం చేసుకున్నారు. కిడ్స్‌ విభాగంలో ఆర్‌.చరణ్‌, కె.భరత్‌, పి.పూర్ణేస్‌, జి.హేమంత్‌, కె.కజిత్‌ స్వర్ణ పతకం సాధించారు. జి.అక్షిత, అనీష్‌కుమార్‌ రెడ్డి, కె.జ్ఞానదీప్‌, కె.తనీష్‌, భవేష్‌లు రజత పతకాలతో సత్తాచాటారు. స్వర్ణపతకం సాధించిన విద్యార్థులు తమిళనాడు రాష్ట్రంలో జరగబోయే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement