● పొందూరులో సోషల్ క్లబ్ స్థలంపై టీడీపీ
నాయకుల కన్ను
● స్థలాన్ని విక్రయించాలని వారసులపై ఒత్తిడి
● ఆసక్తి చూపకపోవడంతో కుట్రలకు దిగిన నేతలు
● షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు తవ్వకాల పనులు
● యథాస్థితిలో ఉంచాలని స్టేటస్‌కో ఇచ్చిన కోర్టు
ఏం జరుగుతుందో..
సోషల్ క్లబ్ స్థలంపై టీడీపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే పర్వాలేదు. కానీ, గతంలో దాతలు ఇచ్చిన స్థలం వినియోగించకపోతే దానిని ప్రభుత్వ ఇతర అవసరాలకు వినియోగిస్తామని చెప్పడం వెనక దుర్బుద్ధి ఉండటం ఆరోపణలకు ఆస్కారమిచ్చాయి. టీడీపీ నాయకులు అడిగినట్టు సోషల్ క్లబ్ స్థల దాతల వారసులు అమ్మకానికి పెడితే ఒక రూల్.. వారికి విక్రయించకపోతే మరో రూలా అని విమర్శలు వస్తున్నాయి. టీడీపీ నాయకుల దుర్నీతిపై వారసులు కూడా గట్టిగా పోరాడుతున్నారు. చివరికి ఏం జరుగుతుందో చూడాలి.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
పొందూరు సోషల్ క్లబ్ స్థలంపై టీడీపీ నాయకులు కన్నేశారు. సుమారు రూ.4 కోట్ల విలువైన స్థలాన్ని ఎలాగైనా కొట్టేయాలని చూశారు. ఆ స్థలాన్ని తమకు అమ్మేయాలని వారసత్వ ఆస్తిగా భావిస్తున్న వారిపై తీవ్ర ఒత్తిడి చేశారు. కాదనడంతో వారిపై కుట్రల బాణాలు సంధిస్తున్నారు. తమకు దక్కనిది మరొకరికి దక్కకూడదని పావులు కదుపుతున్నారు. ప్రభుత్వ ఆస్తిగా పంచాయతీకి దఖలు పరిచి, ప్రభుత్వ అవసరాలకు వినియోగించడానికి పథక రచన చేశారు. అందులో భాగంగా ఇప్పటికే కార్యాచరణ అమలు చేశారు.
వారసత్వ పోరాటం..
1967లో సరస్వతి నిలయం పేరుతో సోషల్ క్లబ్ ఏర్పాటు చేశారు. అప్పట్లో క్లబ్ కోసం పూర్వీకులు 19.250 సెంట్ల స్థలాన్ని ఇచ్చారు. కాలక్రమేణా ఆ క్లబ్ మూతబడింది. ఏ ప్రయోజనాలకై తే ఇచ్చారో దానికోసం కొన్నేళ్లుగా వినియోగించకపోవడంతో స్థలవితరణ చేసిన వారసులు ఆ భూమి కోసం న్యాయపోరాటం చేస్తున్నారు. తమ కుటుంబీకులు ఇచ్చిన స్థలం తమకే దక్కాలని కోరుతున్నారు.
స్థలంపై టీడీపీ నేతల కన్ను..
అనధికారికంగా ఆ స్థలం అమ్మేయాలని టీడీపీ నాయకులు వారసులపై ఒత్తిడి చేశారు. రూ.4 కోట్లకు పైగా విలువ ఉండటంతో ఆ స్థలాన్ని ఎలాగైనా దక్కించుకువాలని యత్నించారు. అందుకు వారసులు అంగీకరించడం లేదు. దీంతో టీడీపీ నాయకులకు కన్నుకుట్టింది. తమకు దక్కనిది వేరొకరికి దక్కకూడదని పంచాయతీ ద్వారా పావులు కదిపారు. ఆ స్థలం ప్రభుత్వానికి ఇచ్చిందని, అది ప్రభుత్వానికే చెందుతుందని చెప్పడమే కాకుండా ఆ సోషల్ క్లబ్ భవనంలో స్వర్ణ పొందూరు 3 సచివాలయం కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు తవ్వకాల పనులు చేపట్టారు. దీనిపై వారసులు న్యాయపోరాటానికి దిగారు. సెప్టెంబర్ 2న కోర్టు స్టేటస్‌కో ఇచ్చింది. 10వ తేదీ వరకు భౌతిక స్వరూపాన్ని మార్చకుండా యధాస్థితిలో ఉంచాలని కోర్టు ఆదేశించింది.
ఉద్యోగుల హక్కుల సాధనకు ఐక్యపోరాటాలే శరణ్యమని ఏపీ జేఏసీ అమరావతి ప్రతినిధులు పేర్కొన్నారు. బుధవారం జిల్లా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బీవీవీఎన్ రాజు నేతృత్వంలోని ఉద్యమ కమిటీ ప్రతినిధులు నల్లబ్యాడ్జీలు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, కొవ్వాడ భూసేకరణ యూనిట్ కార్యాలయం, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాలను సందర్శించారు. పీఆర్‌సీ, ఐఆర్, డీఏ బకాయిలకు సంబంధించి కరపత్రాలను ఉద్యోగులకు పంపిణీ చేశారు. అనంతరం గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించి ఉద్యమ కార్యాచరణను వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం నాయకులు టి.నాగరాజు, డి.శ్రీధర్, బి.పద్మప్రియ, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సచివాలయాల సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు ఎస్.గోవిందరావు, జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ పాణిగ్రహి, వీఆర్‌ఓల సంఘం శ్రీకాకుళం డివిజన్ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి, వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు జి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్ :


