పాతపట్నం: ప్రముఖ నేపథ్య గాయని ఎస్.జానకి మృతి తెలుగు ప్రేక్షకులకు, సినీ పరిశ్రమకు తీరని లోటు అని డి.వి.సుబ్బారావు కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఏ.హరిబాబు అన్నారు. పాతపట్నం ఆల్‌ఆంధ్ర రోడ్డు సమీపంలోని షిర్డీగిరిపై సంఘం ఆధ్వర్యంలో సంతాప సభ ఆదివారం నిర్వహించారు. జానకి చిత్రపటానికి పూలుమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ సుమారు 50 వేల పాటలు పాడిన జానకి గొప్ప గాయకురాలిగా చరిత్రలో చిరస్మరణీయురాలిగా నిలిచిపోతారని కొనియాడారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పెద్దింటి మోహన్‌దాస్, ప్రధాన సలహాదారుడు శాసనపూరి మధుబాబు, వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్ట ఆంజనేయులు, సహాయ కార్యదర్శి బాడాన షణ్ముఖరావు, కార్యనిర్వహణ అధ్యక్షుడు కొన వెంకటరమణ, సింగర్ ఎస్పీ మిశ్రా, సంపతరావు, కృష్ణారావు, సోమేశ్వరరావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


