శ్రీకాకుళం కల్చరల్: బండికల్లు వేంకటేశ్వరులు ఫౌండేషన్, మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ సంయుక్త నిర్వహణలో 10వ జాతీయ స్థాయి కథల పోటీలకు కథలను ఆహ్వానిస్తున్నట్లు అధ్యక్షులు బండికల్లు జమదగ్ని, కలిమిశ్రీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు కథకులు ఎక్కడ ఉన్నా పోటీలో పాల్గొనవచ్చని తెలిపారు. కుటుంబ గౌరవం, నైతిక విలువలను తెలియజేసే కథలు, సమాజంలో తాజా మార్పులు, సమస్యలు చూపుతూ వాటికి చక్కని పరిష్కారాలను తెలిపే కథలను ‘బండికల్లు జమదగ్ని, ఫ్లాట్ నెం.402, హిమజ టవర్స్, 3/10 బ్రాడీపేట, గుంటూరు –522002’ చిరునామాకు పంపాలన్నారు. మరిన్ని వివరాలకు 98482 64742 నంబరును సంప్రదించాలని కోరారు.
ఇవేం పనులు?
హిరమండలం: శ్రీముఖలింగం నుంచి నవతల వరకు కోట్ల రూపాయలతో ఇటీవల రహదారి నిర్మంచారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో భగీరథిపురం, మహాలక్ష్మిపురం మధ్య పలుచోట్ల రోడ్డుపై రాళ్లు తేలిఛిద్రం అయ్యింది. నిర్మించిన రెండు నెలలకే రహదారిపై రాళ్లు తేలితే ఏళ్ల తరబడి ఎలా ఉంటుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే రహదారులు, భవనాలశాఖ అధికారులు స్పందించి లోపాలను గుర్తించి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.


