తదితరులు
ఊరూరా ఘనంగా వైఎస్సార్ సీపీ ఆవిర్భావ వేడుక
గుండెల
నిండా..
బడుగుల పార్టీ
వైఎస్సార్‌సీపీ బడా బాబుల పార్టీ కాదు. బడుగుల పార్టీ. వైఎస్ జగన్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని పార్టీ ని ఈ స్థాయిలో నిలబెట్టారు. ఇప్పు డు జరుగుతున్న దాడులు, కుట్రలు తిప్పికొట్టాల్సిన బాధ్యత మనపైనే ఉంది. – తమ్మినేని సీతారాం,
మాజీ స్పీకర్
యువజన శ్రామిక రైతుల జెండా ఊరూరా సగర్వంగా ఎగిరింది. స్పష్టమైన భవిష్యత్ లక్ష్యాలతో, స్వచ్ఛమైన భావజాలంతో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ వేడుక గురువారం పండగ వాతావరణంలో జరిగింది. అందరి లక్ష్యం ఒక్కటే.. జన సంక్షేమం. అందరి నినాదం ఒక్కటే.. ప్రజాభ్యుదయం. మాటల ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూనే అధికార పీఠాన్ని అధిరోహించే దిశగా కార్యకర్తలకు నాయకులు దిశా నిర్దేశం చేశారు. వైఎస్సార్ ఆశయ సాధనే ధ్యేయమని చాటి చెప్పారు.
ఇచ్ఛాపురం: వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పిస్తున్న సమన్వయకర్త సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు తదితరులు
సంక్షేమమే మన లక్ష్యం
ప్రజాసంక్షేమమే వైఎస్సార్ సీపీ లక్ష్యం. అందు కోసమే ఈ పార్టీ ఆవిర్భవించింది. ఇంటి వద్దకే పాలన అందించిన ఘనత ఒక్క వైఎస్ జగన్ దే. కూటమి మోసాలు ప్రజలు గమనిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడుతుంది. – పిరియా విజయ, జెడ్పీ చైర్ పర్సన్, నర్తు రామారావు, ఎమ్మెల్సీ
– సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, పార్టీ ఇచ్ఛాపురం సమన్వయకర్త
కార్యకర్తలే బలం
వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే కొండంత బలం. వైఎస్సార్ ఆశయ సాధన కోసం పుట్టిన పార్టీయే వైఎస్సార్ సీపీ. ‘నేను వైఎస్సార్ సీపీ..’ అని ధైర్యంగా చెప్పగలిగే పాలన అందించాం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగడదాం. – ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు
పేదల పార్టీ..
పేదల కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్‌సీపీ. సంక్షేమం, అభివృద్ధి రెండూ ఈ పార్టీకి రెండు కళ్లు. అదే పంథాలో వైఎస్ జగన్ పాలించి చూపించారు. చంద్రబాబును ఎప్పుడు గద్దె దింపుదామా అని జనం చూస్తున్నారు.
– రెడ్డి శాంతి, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే
పాతపట్నం: ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి
నరసన్నపేట: కేకు కట్‌చేస్తున్న ధర్మాన కృష్ణదాస్, కృష్ణచైతన్య. చిత్రంలో అంధవరపు సూరిబాబు


