శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో 2,79,100 రైతు కుటుంబాలకు అన్నదాత సుఖీభవ పథ కం వస్తుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘సూపర్ సిక్స్‘ కార్యక్రమంలో భాగంగా అన్న దాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో కలిపి రూ.20వేలు ఇస్తామన్నారు. జిల్లాకి సంబంధించి 2,79,100 రైతు కుటుంబాలకు అన్నదాత సుఖీభవ పథ కం కింద రూ.4000 చొప్పున మూడో విడతగా రూ.111.64కోట్లు జమచేయనున్నట్లు తెలిపారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘సాక్షి’లో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు. తమపై కీలక నేత ఒత్తిళ్లు లేవని, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదని శ్రీకాకుళం, గార మండల పరిషత్ అధికారులు, రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. తన సస్పెన్షన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని, దీని వెనక ఎవరో ఉన్నా రని భావించడం లేదని హనుమంతు కూర్మారావు తెలిపారు. అధికారుల సెలవుల వెనక వారి వ్యక్తిగత కారణాలు తప్ప మరేమీ లేదని మున్సిపల్ అధికారులు ప్రకటన ద్వారా వెల్లడించారు. పట్టణ టీడీపీ నాయకులు సైతం ప్రెస్ మీట్ పెట్టి, ఎమ్మెల్యేపై చేస్తున్న ఆరోపణలు సరికాదని చెప్పారు.
సంతబొమ్మాళి: పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో లక్కీవలస గ్రామంలో గురువారం లేగ దూడల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పశుగణాభివృద్ధి సంస్థ జిల్లా కార్యనిర్వహణాధికారి డాక్టర్ సీహెచ్ సత్యప్రకాష్ మాట్లాడుతూ లేగ దూడలకు వచ్చే వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రస్తుతం పాడి పశువుల కొనుగోలు రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల పశువుల కొనుగోలు చేయడం కష్టమని, అందువల్ల తమ దగ్గర ఉన్న పశువులనే సంతానానికి పనికివచ్చే పశువులుగా మార్చుకోవాలని కోరారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి న ఆడదూడల ఉత్పత్తి పథకాన్ని పాడి రైతులందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. 41 లేగ దూడలు పోటీల్లో పాల్గొన్నాయి. విజేతలకు బహుమతులు అందజేశారు.
‘హెచ్‌పీవీ వ్యాక్సిన్
సద్వినియోగం చేసుకోవాలి’
టెక్కలి: బాలికల్లో గర్భాశయ క్యాన్సర్ రాకుండా ముందస్తు నివారణ కోసం ఉచితంగా అందజేస్తున్న హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను సద్వినియోగం చేసుకోవాలని టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి కోరారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన కోసం గురువారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీ వైద్యురాలు ఎస్.గాయత్రీ మాట్లాడుతూ 14 ఏళ్లు పూర్తయి 15 వ సంవత్సరం లోపు (పుట్టిన రోజుకు మునుపు) బాలి కలకు మాత్రమే ఈ వ్యాక్సిన్ వేస్తారని తెలిపా రు. టెక్కలి మండలంలో 384 మంది బాలికలను గుర్తించినట్లు ఆమె పేర్కొన్నారు. టెక్కలి మండలం కె.కొత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ వ్యాక్సిన్ వేస్తారని వైద్యురాలు గాయత్రీ వెల్లడించారు. ఉదయం 9 నుంచి సాయంత్ర 4 గంటల వరకు వ్యాక్సిన్ వేస్తారని పేర్కొన్నారు. ఆధార్ కార్డుతో పాటు ఆధార్ అనుసంధానం కలిగిన ఫోన్ నంబర్‌తో పీహెచ్‌సీకు రావాలని కోరారు.
నేడు కవయిత్రి మొల్ల జయంతి
శ్రీకాకుళం పాతబస్టాండ్: కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ(మొల్ల) జయంతి శుక్రవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలకు కవయిత్రి మొల్ల చిత్రపటానికి పుష్పమాలాంకరణ, అనంతరం జ్యోతి ప్రజ్వలన నిర్వహించనున్నారు.


