ఎన్నిటెన్‌షన్‌లో..! | - | Sakshi
Sakshi News home page

ఎన్నిటెన్‌షన్‌లో..!

Feb 12 2026 11:29 AM | Updated on Feb 12 2026 11:29 AM

ఎన్నిటెన్‌షన్‌లో..!

ఎన్నిటెన్‌షన్‌లో..!

శ్రీకాకుళం:

రాష్ట్ర విద్యాశాఖ 10వ తరగతి పరీక్షలకు సంబంధించి కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తోంది. వంద రోజుల ప్రణాళిక అంటూ విద్యార్థులను టెన్షన్‌కు గురి చేస్తోంది. గతంలో పిల్లలను విద్యా నైపుణ్యాలను బట్టి ఏ,బి,సి, డి గ్రేడ్‌లుగా విభజించేవారు. సి, డి గ్రేడ్‌లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టేవా రు. అయితే తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన మౌఖిక ఆదేశాలు అమలు చేయడం ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, క్లస్ట ర్‌ ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారింది. దీర్ఘకాలికంగా పాఠశాలకు గైర్హాజరవుతున్న వారితో పాటు సి, డి గ్రేడ్‌ విద్యార్థులను హాస్టళ్లకు తరలించి రెసిడెన్షియల్‌ తరహాలో బోధన చేయాలని ఆదేశించారు. రెండు రోజుల నుంచి ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రతి మండలంలోనూ కేజీబీవీలు ఉండడంతో బాలికలను అక్కడకు తరలించాలని, బాలురను డివిజన్‌ స్థాయిలో ఒకే చోటకు బీసీ, ఎస్సీ ఎస్టీ హాస్టళ్లలో ఏదో ఒకదానికి తరలించాలని రాష్ట్రస్థాయి నుంచి ఆదేశాలు వచ్చాయి.

జిల్లాలో శ్రీకాకుళం డివిజన్‌ను పరిగణనలోకి తీసుకుంటే శ్రీకాకుళం కేజీబీవీకి 34 మంది విద్యార్థినులను, గారలోని బీసీ వసతి గృహానికి 150 మంది వరకు విద్యార్థులను తరలించారు. అయితే వచ్చిన ఒక్క రోజులోనే బాలికల్లో 18 మందికి పైగా బాలురలో 60 మంది వరకు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. తల్లిదండ్రులను విడిచిపెట్టి తాము ఉండలేమని రోదిస్తూ ఉండడంతో వారిని పంపించేశారు. హాస్టళ్లలో ఉన్న వారికి భోజనం విషయంలో స్పష్టత లేదు. ప్రీ ఫైనల్‌ పరీక్షల నిర్వహణలోనే అయోమయమే గోచరిస్తోంది. తల్లిదండ్రులు కూ డా ఈ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

టెన్త్‌ క్లాస్‌ సి, డి గ్రేడ్‌

విద్యార్థులకు రెసిడెన్షియల్‌ మోడ్‌లోకి తరలింపు

బాలికలకు మండల స్థాయి, బాలురకు డివిజన్‌ స్థాయికి తరలింపు

తల్లిదండ్రులకు దూరంగా ఉండలేమని వెళ్లిపోతున్న విద్యార్థులు

ఎలాగైనా చేర్చాల్సిందేనని ఒత్తిడి

బలవంతంగా తీసుకురావడం లేదు

జిల్లాలో సోమవారం నుంచి రెసిడెన్షియల్‌ తరహా బోధన ప్రారంభమైంది. విద్యార్థులను ఎవరినీ బలవంతంగా తరలించడం లేదు. విద్యార్థులను ఒప్పించే తీసుకువస్తున్నాం. క్లస్టర్‌ ఉపాధ్యాయులతో ప్రత్యేక బోధన వీరికి చేయిస్తాం.

– రవిబాబు, జిల్లా విద్యాశాఖ, అధికారి

విద్యార్థుల బాగు కోసమే

రెసిడెన్షియల్‌ విధానం అమలు చేస్తున్నది విద్యార్థుల కోసమే. నెల రోజులు పాటు ఉంటే సులభంగా ఉత్తీర్ణత సాధించవచ్చు. రెసిడెన్షియల్‌ విధానంలోకి వచ్చిన కొందరు తిరిగి ఇళ్లకు వెళ్లిపోతుండడం నిజమే. – సుజాత,

మండల విద్యాశాఖ అధికారి, శ్రీకాకుళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement