మన శాసనాలు ఇక భద్రం | - | Sakshi
Sakshi News home page

మన శాసనాలు ఇక భద్రం

Feb 12 2026 11:29 AM | Updated on Feb 12 2026 11:29 AM

మన శా

మన శాసనాలు ఇక భద్రం

శ్రీకాకుళం పురాతన శాసనాలు డిజిటలైజేషన్‌ కానున్నట్లు అసిస్టెంట్‌ ఎపిగ్రఫిస్ట్‌ ఆదిత్య కుమార్‌ సింగిరెడ్డి తెలిపారు. స్థానికంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారతశ్రీ ప్రాజెక్టులో భాగంగా సమస్త భారత దేశం నుంచి సేకరించిన శాసన అచ్చులను డిజిటలైజేషన్‌ చేస్తున్నామని పేర్కొన్నారు. పురావస్తు శాఖ శాసన విభాగ బృందం శాసనాల ప్రతులను సేకరిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా సుమారు 120 ఏళ్లకు పూర్వం సేకరించిన అచ్చులలో కొన్ని పాడై పోవడం వల్ల వాటిని తిరిగి సేకరించే బృహత్తర కార్యక్రమం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా తాము శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగేశ్వర ఆలయం, భీమేశ్వర ఆలయం, శ్రీకూర్మనాథ ఆలయం తదితర ప్రసిద్ధ ఆలయాల్లో తిరిగి అచ్చు తీసే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరో మూడు బృందాలు రాష్ట్రమంతటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయన్నారు.

–శ్రీకాకుళం కల్చరల్‌:

శ్రీముఖలింగంలో సేకరిస్తున్న అచ్చులు

మన శాసనాలు ఇక భద్రం 1
1/1

మన శాసనాలు ఇక భద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement