శివరాత్రి జాతరపై దిశానిర్దేశం
జలుమూరు: శ్రీముఖలింగంలో శివరాత్రి ఉత్సవాలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిపించాలని ట్రైనీ కలెక్టర్ డి.పృథ్వీరాజ్‌కుమార్ ఆదేశించారు. ఆయన బుధవారం శ్రీముఖలింగంలో శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూషతో కలిసి మాఢ వీధులు పరిశీలించారు. స్వామివారిని చక్రతీర్థ స్నానా లకు తీసుకెళ్లే మార్గాలు పరిశీలించి పలు సూచన లు ఇచ్చారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా రోడ్డుకు ఇరువైపులా షాప్‌లు పది అడుగులు వరకూ దూరంగా ఉంచుకోవాలన్నారు. ఆయనతోపాటు తహసీల్దార్ జెన్ని రామారావు, ఎంపీడీఓ చిన్నమ్మడు, సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ బి.అశోక్‌బాబు, అర్చకులు పాల్గొన్నారు.
రావివలసలో శివరాత్రికి ఏర్పాట్లు
టెక్కలి: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా టెక్కలి మండలం రావివలస ఎండల మల్లికార్జునస్వామి దేవస్థానంలో పక్కాగా ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. బుధవారం మల్లన్న దేవ స్థానంలో శివరాత్రి ఏర్పాట్లను ఆయన పరిశీ లించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వా మి వారి దర్శనం కలిగే విధంగా చూడాలన్నారు. ఎక్కడా ఎలాంటి తొక్కిసలాటలు లే కుండా ఏర్పాట్లు చేయాలన్నారు. మంచినీరు, వైద్యం, పారిశుద్ధ్యం, విద్యుత్ సదుపాయం, పోలీస్ బందోబస్తు, ఉచిత ప్రసాదాలు తదితర సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం వద్దని జేసీ స్పష్టం చేశారు. అనంతరం మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
డీఎస్పీ వివేకానందకు బదిలీ
శ్రీకాకుళం క్రైమ్ : శ్రీకాకుళం సబ్ డివిజనల్ అధికారిగా (డీఎస్పీగా) 2024 ఏడాది ఆగస్టులో వచ్చిన సీహెచ్ వివేకానంద బుధవారం బదిలీ అయ్యారు. విశాఖ హార్బర్‌కు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా (ఏసీపీ) బదిలీ చేస్తూ మంగళగిరి డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించినట్లు ఉత్తర్వుల్లో రాలేదు.
● పూర్వ విద్యార్థి ఔదార్యం
సంతబొమ్మాళి: దండుగోపాలపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1966లో 10వ తరగతి చదువుకున్న డాక్టర్ లమ్మత విశ్వనాథం తన బడికి బుధవారం రూ.కోటి విరాళం ప్రకటించారు. పాఠశాల పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగింది. దాదాపు 60 ఏళ్ల తర్వాత అంతా కలుసుకున్నారు. ఈ పాఠశాలలో విద్యనభ్యసించిన డాక్టర్ లమ్మత విశ్వనాథం అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన జీవిత గమనాన్ని ‘నా జీవనయానం కాళీపురంలో మొదలై’ అనే పేరున ఆత్మకథగా అదే బడిలో చదివిన సీనియర్ పాత్రికేయుడు చింతాడ కృష్ణారావు రచించా రు. ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ విశ్వనాథం మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తన వంతుగా ఇస్తున్న కోటి రూపాయలు విరాళాన్ని ఆడిటోరియం నిర్మాణానికివెచ్చించాలని కోరారు. దీనిపై హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.
శివరాత్రి జాతరపై దిశానిర్దేశం
శివరాత్రి జాతరపై దిశానిర్దేశం


