● వాసుదేవుడు వరుడాయెను..!
మురిపెంగా మాలల మార్పిడి, తమకంగా తలంబ్రాల సేవ, ముచ్చటగా మూడు ముళ్లు, కమనీయంగా కల్యాణ ఘట్టాన్ని చూసి మందస వాసు లు తరించారు. మందస వాసుదేవుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో జరిగిన స్వామి కల్యాణం తన్మయత్వం కలిగించింది. క్రతువులో ప్రతి ఘట్టాన్ని తాదాత్మ్యంతో చూసిన భక్తులు మైమరచిపోయారు. గరుడ వాహన సేవ, సంగీత, నృత్య విభావరి ఉత్సవానికి మరింత శోభను అద్దాయి. వేలాది మంది అన్నదాత సంతర్పణలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు. – మందస


