అందుబాటులో ఆక్వా ల్యాబ్‌లు
అరసవల్లి: జిల్లాలోని ఆక్వా ల్యాబ్‌ల్లో రైతులకు వివిధ రకాల సేవలందిస్తున్నామని మత్స్యశా ఖ డిప్యూటీ డైరెక్టర్ వై.సత్యనారాయణ బుధవారం తెలిపారు. జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో ఉన్న ల్యాబ్‌తో పాటు నరసన్నపేట, టెక్కలి, సోంపేట, పలాసలలోని ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌లలో నీటి విశ్లేషణ పరీక్షలు, పీహె చ్ ఉష్ణోగ్రత, టీడీఎస్, లవణీయత, అమ్మో నియో, మట్టి పీహెచ్ తదితర పరీక్షలకు నిర్ణీత రుసుం చెల్లించి ఫలితాలు పొందవచ్చని పేర్కొన్నారు. కొత్తగా చేపలు, రొయ్యిల చెరువుల రిజిస్ట్రేషన్ల కోసం సచివాలయాల్లో మత్స్య సహాయకులను సంప్రదించాలని కోరారు.
మద్యం బెల్టుషాపులపై
ఎకై ్సజ్ దాడులు
● బొడ్డపాడుకాలనీలో వ్యక్తి అరెస్టు
● మద్యం బాటిళ్లు స్వాధీనం
పలాస: వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లో బుధవారం పలాస ఎకై ్సజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. పలాస మండలం బొడ్డపాడు కాలనీలో బెల్టు షాపు నిర్వహిస్తున్న మామిడి పాపారావును అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అతని వద్ద నుంచి అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ‘ కల్తీ మద్యం తాగి ప్రాణాలు పోతున్నాయి’ అనే శీర్షికతో సాక్షి మెయిన్ ఎడిషన్‌లో బుధవారం ప్రచురితమైన కథనానికి ఎకై ్సజ్ అధికారులు స్పందించారు. అక్కుపల్లి, బొడ్డపాడు కాలనీ, గరుడఖండి, అల్లుకోల తదితర గ్రామాల్లో పర్యటించి మద్యం దుకాణాలపై పలాస ఎకై ్సజ్ సీఐ కె.మల్లికార్జునరావు, సిబ్బంది సూర్యారావు, సింహాచలం తదితరులు తనిఖీలు చేశారు. కాగా, బెల్టుషాపుల నిర్వాహకులకు ముందుగానే ఎకై ్సజ్ పోలీసులు తనిఖీలకు వస్తున్నట్టు సమాచారం చేరవేయడంతో బెల్టుషాపుల నిర్వాహకులు జాగ్రత్త పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వసతి గృహంలో మెనూపై ఆరా
మెళియాపుట్టి: మండల కేంద్రం మెళియాపుట్టికి సుమారు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న భరణికోట గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని సీతంపేట ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న మెనూపై ఆరా తీశారు. వసతి గృహం పరిసరాలు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులతో వ్యక్తిగతంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఇన్‌చార్జి హెచ్‌ఎం వాసంతికి సూచించారు. ఇటీవల డిప్యూటీ డీఓ నారాయుడు వసతిగృహాన్ని సందర్శించిన నేపథ్యంలో మెనూ సక్రమంగా అమలు కావడం లేదనే ఫిర్యాదు రావడంతో పీఓ ఇక్కడికి సందర్శనకు వచ్చినట్లు తెలిసింది.
పరిశ్రమల్లో భద్రతపై రాజీవద్దు
శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లాలోని రసాయన పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలులో రాజీపడవద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంక్షోభ నివారణ బృందం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ సిఫార్సులను యుద్ధప్రతిపాదికన అమలు చేయాలన్నారు. పైడిభీమవరంలోని శ్రేయాస్ ఇండస్ట్రీస్‌లో మిథనాల్ నిల్వ సామర్థ్యాన్ని కమిటీ పరిశీలించాలన్నారు. పరిశ్రమల్లో విష వాయువుల లీకేజీని గుర్తించేలా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిరంతరం నిఘా ఉంచాలని, అత్యవసర సమయాల్లో స్పందించేందుకు వీలుగా ఆన్–సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. పరిశ్రమల్లో ప్రమాదాలపై సమీప గ్రామాల ప్రజలకు, కార్మికులకు అవగాహన కల్పించడంతో పాటు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లకు జిల్లా అగ్నిమాపక అధికారి ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో విశాఖపట్నం ఫ్యాక్టరీల జాయింట్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ జె.శివశంకర్ రెడ్డి, జిల్లా డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ బి.రాంబాబు, డీఐసీ జనరల్ మేనేజర్ రఘునాథ్, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.
అందుబాటులో ఆక్వా ల్యాబ్‌లు


