● రూ.7 లక్షల విలువైన ధాన్యం లారీ పట్టివేత
హిరమండలం: ఎల్‌ఎన్‌పేట మండలం స్కాట్‌పేట వద్ద మంగళవారం ఓ అనూహ్య ఘటన జరిగింది. ఓ మిల్లుకు ధాన్యం లోడుతో వచ్చిన లారీ రోడ్డు పక్కనే నిలబెట్టి ఉంది. ఆ సమయంలో పౌరసరఫరాల శాఖ డీఎం టీ.వేణుగోపాలరావు అటువైపుగా వచ్చారు. అనుమానాస్పదంగా కనిపించిన లారీని పరిశీలించారు. ఎక్కడకు తీసుకొచ్చారని డ్రైవర్‌ను అడగ్గా స్థానిక రైస్‌మిల్లుకు తీసుకొచ్చినట్టు తెలిపాడు. కానీ అందుకు తగ్గ పత్రాలేవీ లేవు. పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చినట్లు తెలిసింది. దీంతో ఆ లారీ లోడు ధాన్యాన్ని స్థానిక తహసీల్దార్ ఈశ్వరమ్మ, వీఆర్వో రమణమ్మలకు అప్పగించి పోలీస్‌స్టేషన్‌కు తరలించాలని ఆదేశించారు. లారీలో రూ.7 లక్షల విలువైన ధాన్యం ఉన్నట్టు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


