సర్వం అక్రమాల మయం | - | Sakshi
Sakshi News home page

సర్వం అక్రమాల మయం

Feb 4 2026 8:27 AM | Updated on Feb 4 2026 8:27 AM

సర్వం అక్రమాల మయం

సర్వం అక్రమాల మయం

అంతా మాయ..!

ఒడిశాలో తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ కొన్నట్లు నమోదు

అక్రమార్కులకు భారీ లబ్ధి

సిక్కోలుకు ఒడిశా ధాన్యం జిల్లా రైతుకు సున్నం

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

డిశా నుంచి జిల్లాకు ధాన్యం అక్రమ రవాణా ఆగడం లేదు. అక్కడ కొనుగో లు చేసిన ధాన్యాన్ని జిల్లాలో కొనుగోలు చేసినట్టుగా లెక్కల్లో చూపిస్తున్నారు. ఒడిశాలో తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరను పొందుతున్నారు. కొందరు మిల్లర్లు, దళారులు కుమ్మకై ్క అక్రమ దందా సాగిస్తూనే ఉన్నారు. దీనికి కొందరు కొనుగోలు కేంద్రాల సిబ్బంది సహ కరిస్తున్నారు. అక్రమంగా కొనుగోలు చేసిన ధాన్యా నికి చట్టబద్ధత కలిగిస్తున్నారు. వాస్తవంగా జిల్లాలో ఎక్కడికక్కడ కొనుగోలు చేయని ధాన్యం రైతుల వద్ద ఉంది. లక్ష్యాలు అయిపోయాయని కొందరు మిల్లర్లు, బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వక మరికొందరు మిల్లర్లు కొనుగోలు చేయడం లేదు. కానీ, తక్కువ ధరకు దొరికే ఒడిశా ధాన్యాన్ని మాత్రం ఇక్కడ ఆన్‌లైన్‌ చేసి దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు.

జిల్లాలో ధాన్యం కొనుగోలు అంతా ఒక మిస్టరీగా మారిపోయింది. రైతుల కళ్లాల్లో ధాన్యపు రాశులు కనబడుతుంటాయి. కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసినట్టు లెక్కలు కనిపిస్తాయి. కొనుగో లు చేసిన ధాన్యమంతా ఎక్కడదని ఆలోచిస్తే అదో రహస్యంలా అనిపిస్తోంది. ధాన్యం కొనుగోలు చేయకుండానే కొనుగోలు చేసినట్టు రికార్డులో చూపిస్తూ, వాటికి ట్రక్‌షీట్‌ జారీ చేస్తూ, సీఎంఆర్‌ కోసం మిల్లుకు పంపించినట్టు, మిల్లులు కూడా వచ్చిన ధాన్యాన్ని ఆడించి సీఎంఆర్‌(కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) ఇచ్చినట్టు సైక్లింగ్‌ ప్రక్రియ అంతా సాగిపోతోంది.

ఒడిశా నుంచి తీసుకొచ్చిన ధాన్యాన్ని ఇక్కడ రైతుల వద్ద కొనుగోలు చేసినట్టుగా చూపించి, రికార్డుల్లో కౌలు రైతులు తీసుకున్న భూముల వివరాల్లో ఆన్‌లైన్‌ చేసి, వాటికి ట్రక్‌షీట్‌ జారీ చేసి, మిల్లులకు తరలించినట్టు జిమ్మిక్కు చేస్తున్నారు. ఇదంతా పథకం ప్రకారం జరుగుతోంది. దళారులు, మిల్లర్లు కుమ్మకై ్క చేస్తున్న బాగోతమిది. వీటికి తోడు రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల ద్వారా వచ్చినఽ ధాన్యాన్ని తేమ శాతం, నూకలు పేరుతో 5 నుంచి 10 కిలోలు వరకు అదనంగా తీసుకుని దోపిడీ చేస్తున్న సంగతి ఇక చెప్పనక్కర్లేదు. రైతుల నుంచి వచ్చిన ధాన్యాన్ని ఆడించి సీఎంఆర్‌ ఇవ్వాల్సిన స్థానంలో పీడీఎస్‌ బియ్యం ఇస్తారన్న ఆరోపణలు ఉండనే ఉన్నాయి.

ఇలా జరగాలి..

వాస్తవంగా మిల్లుల వద్ద రెండు రకాల ధాన్యం ఉండాలి. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి వచ్చిన ధాన్యాన్ని ‘ఏ’ రిజిస్టర్‌లో నమోదు చేసి, ఆ ధాన్యానికి బదులు సీఎంఆర్‌ ఇవ్వాలి. చెప్పాలంటే సవ్యంగా జరిగిన ప్రక్రియ అని చెప్పాలి. ఇక, మిల్లర్లు నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంది. కాకపోతే, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. అలా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ‘బి’ రిజిస్టర్‌లో నమోదు చేయాలి. ఇవన్నీ ఎప్పటికప్పుడు అఽధికారులు తనిఖీలు చేసి పరిశీలించాలి.

ఆ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదు. రైతుల విస్తీర్ణంలో మాయ చేసి మద్దతు ధర కొట్టేస్తున్నారు.

● తాజాగా ఎల్‌ఎన్‌పేట మండలం స్కాట్‌పేట వద్ద పట్టుబడ్డ లారీ కూడా అలాంటిదే. ఒడిశాలో కొనుగోలు చేసిన ఽరూ.7లక్షల విలువైన ధాన్యాన్ని అక్రమంగా లారీలో ఒక రైస్‌మిల్లుకు తీసుకొస్తూ జిల్లా అధికారులకు పట్టుబడ్డారు.

● వాస్తవంగా జిల్లాలో ఇప్పటికే 6.70లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోళ్లు జరిగిపోయాయి. మరో 70వేల మెట్రిక్‌ టన్నుల వరకు లక్ష్యాల మేర కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇది కాకుండా మరో లక్ష మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం రైతుల వద్ద ఉంది. ఏ, బీ రిజిస్టర్‌ల ప్రకారం కొనుగోలు చేయాలి. కానీ ఇక్కడైతే మద్దతు ధర రైతులకు ఇవ్వాల్సి వస్తుందని, ఒడిశాలో తక్కువ రేటుకు కొని ఇక్కడ మద్దతు ధరకు అమ్మి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement