ఉచితం.. అత్యల్పం! | - | Sakshi
Sakshi News home page

ఉచితం.. అత్యల్పం!

Feb 4 2026 6:57 AM | Updated on Feb 4 2026 6:57 AM

ఉచితం

ఉచితం.. అత్యల్పం!

మార్చి 1న సీపీఎస్‌ ఉద్యోగుల సాగరఘోష

అతి తక్కువ మందికే

‘ఏటా మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు’

బ్యాంక్‌ ఖాతాల్లో జమ కాని నగదు

సాంకేతిక సమస్యల పేరిట కోత

కూటమి ప్రభుత్వ తీరుపై ప్రజల్లో

ఆగ్రహం

దరఖాస్తు చేసినప్పటికీ..

అందడం లేదు..

సాంకేతిక సమస్యల వల్లే..

హిరమండలం:

జిల్లాలో ఉచిత గ్యాస్‌ పథకం ప్రహసనంలా మారింది. అధికారంలోకి వస్తే ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లను అందిస్తామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా 2024 అక్టోబరులో దీపావళికి కానుకగా ఈ పథకాన్ని మన జిల్లాలోనే ప్రకటించారు. అక్కడ నుంచి ప్రతి నాలుగు నెలలకు ఒక గ్యాస్‌ సిలెండర్‌ను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. ఈ లెక్కన ఇప్పటివరకూ ప్రతి కుటుంబానికి ఐదు గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా అందించాలి. కానీ ఒకటి రెండుసార్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అది కూడా కొంతమంది, కొన్ని ఏజెన్సీలకు మాత్రమే ఇచ్చారు. దీంతో ఉచిత గ్యాస్‌ పథకంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. బ్యాంక్‌ అకౌంట్లలో గ్యాస్‌ నగదు పడకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అమల్లో వైఫల్యం..

జిల్లాలో తెల్లరేషన్‌కార్డు ఉన్న ప్రతిఒక్కరికీ ఉచిత గ్యాస్‌ పథకం వర్తిస్తుందని అప్పట్లో ప్రకటించారు. అప్పట్లో 4,95,793 మంది అర్హులుగా తేల్చారు. ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్‌ ఉచితంగా అందిస్తామని తెలిపారు. గ్యాస్‌ బుక్‌ చేసుకున్న తర్వాత డోర్‌ డెలివరీ చేసే ఏజెన్సీకి వినియోగదారులు డబ్బులు చెల్లిస్తున్నారు. తరువాత ఒకటి రెండు రోజుల్లో సిలిండర్‌ నగదును వినియోగదారుడి బ్యాంక్‌ అకౌంట్లలో వేస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే చాలా మందికి సాంకేతిక కారణాలు చూపుతున్నారు. వేలిముద్ర పడలేదని.. వివరాలు సరిగ్గా అందించలేదని చెప్పడంతో గ్యాస్‌ ఏజెన్సీలతో పాటు అధికారులకు దరఖాస్తులు అందిస్తున్నారు. అయినప్పటికీ బ్యాంక్‌ అకౌంట్లలో రూపాయి కూడా జమకాలేదు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో హెచ్‌పీసీఎల్‌, ఐవోసీఎల్‌, బీపీసీఎల్‌ సంస్థలకు చెందిన మొత్తం 37 ఏజెన్సీలు ఉన్నాయి. వీటి ద్వారా 692825 లక్షల మంది వినియోగదారులు అన్ని పథకాల నుంచి గ్యాస్‌ కనెక్షన్లు పొంది ఉన్నారు. అయితే ఉజ్వల, దీపం వంటివన్నీ తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికే అందించారు. అటువంటప్పుడు లబ్ధిదారుల్లో కోత ఏంటనేది అంతుపట్టడం లేదు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకానికి ముందుగానే చెల్లింపులు చేస్తామని చెప్పింది. అయినా అమలుకావడం లేదు.

లబ్ధిదారులకు కోత

ప్రభుత్వం 2024 నవంబర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించగా మొదటి విడతగా 435037 మందికి ఉచిత సిలిండర్లకు సంబందించిన నగదు జమచేశారు. రెండో విడతగా 408740 మందికి, మూడో విడతగా 352254 మందికి, నాలుగో విడతగా 191015 మంది లబ్ధిదారులకు మాత్రమే ఉచిత సిలిండర్ల నగదు జమ చేశారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: సీపీఎస్‌ రద్దు కోరుతూ రానున్న బడ్జెట్‌ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో సాగర్‌ ఘోష పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తవుతున్నా సీపీఎస్‌ను ప్రస్తావించడం లేదని, ఎన్నికల ముందు ఏడాదిలోగా పరిష్కార మార్గం చూపిస్తామని హామీ ఇచ్చినట్లు గురచ్తు చేశారు. అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు హామీ మరచిపోయారన్నారు. ఇప్పటికే గత ఏడాది సెప్టెంబర్‌ 1న విజయవాడలో భారీ నిరసన తెలియజేశామని చెప్పారు. 26 జిల్లాల్లో సుమారు 2500 కిలోమీటర్ల మేర సీపీఎస్‌ ఉద్యోగుల చైతన్య యాత్ర చేసి కలెక్టర్లకు ఉద్యోగుల సమస్యపై వినతిపత్రాలు ఇచ్చామని గుర్తు చేశారు. ఆ పోరాట ఫలితమే ఇటీవల డీఏల బకాయిల విడుదలయ్యాయని చెప్పారు. మార్చి 1న సీపీఎస్‌ ఉద్యోగుల సాగర ఘోష పేరు తో విశాఖపట్నం ఆర్‌టీసీ బస్టాండ్‌ వద్ద గాంధీ విగ్రహం వద్ద భారీ నిరసన చేస్తామని తెలియజేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర కౌన్సిలర్‌ పి.సూర్యచంద్ర, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

తాబేళ్ల మృతికి వలలే కారణం

ఎచ్చెర్ల : సముద్రతీర ప్రాంతంలో తాబేళ్లు మృత్యువాత పడటానికి మత్స్యకారులు వేసే వలలే కారణమని పొన్నాడ వెటర్నరీ అసిస్టెంట్‌ శ్రీసాయి ప్రసాద్‌ అన్నారు. స్కిడ్‌ నెట్‌, నానాజాతి వలలు, గిల్లెట్‌ నెట్‌, టేకువలల్లో తాబేళ్లు చిక్కుకుని మృతి చెందుతున్నట్లు చెప్పారు. బొంతలకోడూరు ప్రాంతంలో మంగళవారం శ్రీకాకుళం అటవీ పరిధి అధికారి, సిబ్బంది నిర్వహించిన విచారణలో విశాఖపట్నం నుంచి వచ్చే మెకానికల్‌ బోట్లు వల్ల కూడా తాబేళ్లు అధికంగా మృత్యువాత పడుతున్నట్లు గుర్తించామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అటవీ, ఫిషరీష్‌, మైరెన్‌, ట్రీ ఫౌండేషన్‌, స్థానిక మత్స్యకారులతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహించడం అవసరమన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారి రాజశేఖర్‌, ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి వినోద్‌కుమార్‌, ట్రీ ఫౌండేషన్‌, అటవీసిబ్బంది పాల్గొన్నారు.

ఉచిత గ్యాస్‌ సిలిండర్ల విషయంలో సాంకేతిక సమస్య అని చెబుతున్నారు. కార్యాలయాలతో పాటు గ్యాస్‌ ఏజెన్సీకి దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం నేరుగా ఖాతాల్లో జమ చేస్తామని చెబుతోంది. కానీ రకరకాల కారణాలు చెప్పి అందించడం లేదు.

– బి.మురళీ,

గ్యాస్‌ వినియోగదారుడు, తంప, హిరమండలం

మా కుటుంబానికి తెల్ల రేషన్‌కార్డు ఉంది. అయినా ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ అందడం లేదు. ఒకటి రెండు సార్లు మాత్రమే బ్యాంక్‌లో నగదు వేసినట్టూ చూపుతోంది. అయితే ముందుగా గ్యాస్‌ సొమ్ము అకౌంట్లో వేసి పథకం అమలు చేస్తే బాగుంటుంది.

– పెనుమజ్జి పద్మావతి,

గ్యాస్‌ వినియోగదారురాలు,

యంబరాం గ్రామం

జిల్లాలో ఉచిత గ్యాస్‌ పథకం అమలవుతోంది. ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్‌ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. అయితే ఏవైనా తప్పిదాలు, సాంకేతిక సమస్యలు ఉన్నవారికే అందడం లేదు. అటువంటి వారు బ్యాంకులతో పాటు గ్యాస్‌ ఏజెన్సీ కార్యాలయాలను సంప్రదించాలి.

– సూర్యప్రకాశ్‌,

డీఎస్‌వో, శ్రీకాకుళం

ఉచితం.. అత్యల్పం!1
1/4

ఉచితం.. అత్యల్పం!

ఉచితం.. అత్యల్పం!2
2/4

ఉచితం.. అత్యల్పం!

ఉచితం.. అత్యల్పం!3
3/4

ఉచితం.. అత్యల్పం!

ఉచితం.. అత్యల్పం!4
4/4

ఉచితం.. అత్యల్పం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement