ఎస్పీ గ్రీవెన్సుకు 61 ఫిర్యాదులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కార కార్యక్రమం (గ్రీవెన్సు)లో ప్రజల నుంచి 61 వినతులు స్వీకరించారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బాధితుల నుంచి వినతులు స్వీకరించి సకాలంలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్‌లో ఈనెల 27న 10 వేల మంది దంపతులతో స్వర్ణ పుష్పాభిషేక మహోత్సవం, శ్రీమద్విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కార్యక్రమానికి అనుమతి కోరుతూ ఎస్పీని కలిశారు. పీఎన్‌కాలనీ నారాయణ తిరుమల వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.


