8న మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ ఎంపిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

8న మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ ఎంపిక పోటీలు

Feb 4 2026 6:57 AM | Updated on Feb 4 2026 6:57 AM

8న మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌  ఎంపిక పోటీలు

8న మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ ఎంపిక పోటీలు

శ్రీకాకుళం న్యూకాలనీ:

జిల్లాస్థాయి మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ కప్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌ను ఈ నెల 8న నిర్వహిస్తున్నామని జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కిల్లంశెట్టి సాగర్‌, ప్రధాన కార్యదర్శి మెట్ట అశోక్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం శాంతినగర్‌కాలనీలోని ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ టోర్నమెంట్‌తోపాటు రాష్ట్రపోటీల సెలక్షన్‌ ట్రయల్స్‌ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టోర్నీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ నారాయణశెట్టి వెంకట కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఇక్కడ రాణించిన వెటరన్‌ క్రీడాకారులకు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికచేస్తామని చెప్పారు. విజేతలకు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. ఫీల్‌ షోరూమ్‌ అధినేత కేఎస్‌ మదీనా శైలానీ తన తండ్రి కేఎస్‌ సైఫుల్లా జ్ఞాపకార్థం స్పాన్షర్‌షిప్‌ అందిందేందుకు ముందుకు రావడం సంతోషదాయకమని చెప్పారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ జిల్లా చీఫ్‌ ప్యాట్రన్‌ డాక్టర్‌ గూడేన సోమేశ్వరరావు, ఉపాధ్యక్షుడు కేఎస్‌ మదీనా శైలానీ, గురుగుబెల్లి ప్రసాద్‌, బి.దామోదరరావు, ఎన్‌ఈ రత్నజీ. జి.అనిల్‌ కుమార్‌, ఎం.శాంతికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement