ముగిసిన జిల్లా స్థాయి గ్రిగ్స్ పోటీలు
ఆల్‌రౌండ్ చాంపియన్‌గా
శ్రీకాకుళం న్యూకాలనీ:
పాఠశాలల్లో విద్యార్థులను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో గ్రిగ్స్ క్రీడా పోటీలను ప్రతీ ఏటా నిర్వహించేది శ్రీకాకుళం జిల్లా మాత్రమేనని రాష్ట్ర వ్యాయామ విద్య పరిశీలకుడు షేక్ మెహబూబ్ బాషా అన్నారు. శ్రీకాకుళం పీఎస్‌ఎన్‌ఎంహెచ్ స్కూల్ ఆధ్వర్యంలో స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి బాలుర గ్రిగ్స్ పోటీలు మంగళవారంతో ముగిశాయి.
రెండోరోజు ఉదయం జరిగిన వివిధ క్రీడాంశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన బాషా మాట్లాడుతూ ప్రతిరోజు కనీసం గంటపాటు క్రీడల్లో పాల్గొంటే ఆరోగ్యంతో పాటు విద్యలో కూడా రాణించవచ్చన్నారు. కాగా, బాలుర జిల్లా స్థాయి గ్రిగ్స్ పోటీల్లో శ్రీకాకుళం రూరల్ మండలంలోని శాస్త్రులపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తాచాటి ఓవరాల్ చాంపియన్‌గా నిలిచారు. గేమ్స్ చాంపియన్‌షిప్‌ను ఎంజేపీఏపీ నరసన్నపేట విద్యార్థులు కై వసం చేసుకున్నారు. డీఎస్‌డీఓ ఎ.మహేష్‌బాబు విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గ్రిగ్స్ జిల్లా కార్యదర్శి టి.శ్రీనివాసరావు, పీడీ–పీఈటీ అసోసియేషన్ అధ్యక్షుడు పి.తవిటయ్య, ప్రధా న కార్యదర్శి ఎం.వి.రమణ, టోర్నీ ఆర్గనైజర్, హెచ్‌ఎం దేవదత్తానాంద్, పీడీ కె.మాధవరావు, ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ ఎం.తిరుపతిరావు, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి స్వాతి, జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.సాంబమూర్తి, హెచ్‌ఎంలు కె.హరిబాబు, వై.పోలినాయుడు పీడీ, పీఈటీలు పాల్గొన్నారు.
శాస్త్రులపేట పాఠశాల
ముగిసిన జిల్లా స్థాయి గ్రిగ్స్ పోటీలు


