పొన్నాడలో ప్రభుత్వ స్థలం ఆక్రమణ
ఎచ్చెర్ల: మండలంలోని పొన్నాడ గ్రామంలో పాఠశాల సమీపంలోని 255 సర్వే నంబర్ కలిగిన ప్రభుత్వ స్థలాన్ని స్థానికులు కొంతమంది ఆక్రమించుకుంటున్నారు. ఇక్కడ ఉన్న సు మారు రెండెకరాల చెరువు గర్భంలో మొక్కలు వేస్తామంటూ స్థలాన్ని చదును చేస్తున్నారు. ఆ స్థలాన్ని పాఠశాల మైదానం కోసం గతంలో ఇక్కడ ప్రజాప్రతినిధులు అడిగితే ఇది ప్రభు త్వ స్థలమని అధికారులు ఇవ్వలేదు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రాగానే వారి ప్రోద్భలంతో గ్రామానికి చెందిన కొందరు ఇది తమ స్థలమని చదును చేసేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపై వీఆర్‌ఓ మురళీని వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ తమ దృష్టికి రాలేదని, క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎంఆర్‌ఓ గోపాల్ మాట్లాడుతూ ఇది చెరువు గర్భమని, పరిశీలిస్తామని అన్నారు. ఇందులో ఆక్రమణలు చేపడితే చర్యలు తీసు కుంటామని అన్నారు. గతంలో ఇక్కడ పనులు చేపడితే తాము అడిగామని, చెరువు క్లీన్ చేసి చెత్తను భోగి మంటలో వేస్తామని వారు చెప్పారని పేర్కొన్నారు.


