అన్నదాతకు అన్యాయం | - | Sakshi
Sakshi News home page

అన్నదాతకు అన్యాయం

Dec 12 2025 6:05 AM | Updated on Dec 12 2025 6:05 AM

అన్నద

అన్నదాతకు అన్యాయం

జిల్లాలో ధాన్యం కొనుగోలులో అంతా గోల్‌మాల్‌

కొనుగోలు కేంద్రాల కంటే ముందుగానే ధాన్యం కొనుగోలు చేస్తున్న దళారులు

తక్కువ ధరకు కొనుగోలు, అదనంగా నాలుగైదు కిలోలు తూకం

కుమ్మకై ్కన మిల్లులకు తరలింపు

అంతా తానై వ్యవహరిస్తున్న కీలక నేత, సోదరుడు

కీలక నేత, సోదరుడి

మంత్రాంగం

వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సొంత జిల్లాలో అంతా కుమ్మకై ్క రైతులను దోచేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యానికి, పెద్దల అండదండలు ఉన్న మిల్లుల్లో ఉన్న ధాన్యానికి భారీ తేడా కనిపిస్తోంది. దాదాపు ప్రతి మిల్లులోనూ వేలాది ధాన్యం బస్తాలు పేరుకుపోయి ఉన్నాయి. ఇవన్నీ కొనుగోలు కేంద్రాల ద్వారా వచ్చినవి కావు. మూడింతలు ధాన్యం దళారుల ద్వారా మిల్లులకు వచ్చాయి. కొనుగోలు కేంద్రాల సిబ్బంది కంటే ముందే రైతుల్ని సంప్రదించి, రకరకాలుగా భయపెట్టి కొనుగోలు చేస్తున్నారు. బస్తాకు రూ.1400 నుంచి రూ.1600 చెల్లించి, అదనంగా నాలుగైదు కిలోల వరకు తూకం వేసుకుంటున్నారు. దగ్గరుండి రైతుల ద్వారానే మిల్లుకు తరలిస్తున్నారు. ధాన్యం మిల్లులకు చేరిన తర్వాత దళారులు చెప్పిన కొనుగోలు కేంద్రాలకు వెళ్లి ట్రక్‌ షీట్‌ జనరేట్‌ చేస్తున్నారు. అక్కడున్న ఆపరేటర్లు కూడా మిలాఖత్‌ అయి అక్రమాలకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

రైతులను దోచుకుంటున్న మిల్లర్లను కీలక నేత, సోదరుడు అండ్‌కో దోచుకుంటున్నారు. మిల్లులకు వచ్చిన ధాన్యం ఆడించాక కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) కింద తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేటప్పుడు 290 క్వింటాళ్ల లారీకి రూ.2500 చొప్పున అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఆ సీఎంఆర్‌ను గోడౌన్‌కు చేరవేసేటప్పుడు లారీకి రూ.1200 నుంచి రూ.1300 తీసుకుంటున్నారు. ఇది చాలదన్నట్టు ధాన్యం ఆడినందుకు ప్రభుత్వం ఇచ్చే చార్జీల్లో 10 శాతం సొమ్మును బిల్లులు జమ కాకముందే వసూలు చేసేస్తున్నారు. ఇదంతా అడ్డగోలుగా జరుగుతోంది. ఈ ముడుపులన్నీ ఆ కీలక నేత, సోదరుడి వద్దకే చేరుతున్నాయి. దోపిడీపై టీడీపీకి చెందిన ఓ మిల్లరే ఫిర్యాదు కూడా చేశారు.

ధాన్యం కొనుగోలులో విఫలం

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైంది. కొనుగోలు కేంద్రాలు అలంకార ప్రాయంగా మిగిలాయి. అధికారులు వస్తున్నారే తప్ప ప్రయోజనం లేదు. – పంగ వెంకటరమణ,

చిన్న కరగాం, నరసన్నపేట మండలం

తక్కువ ధరకు అమ్ముకుంటున్నాం

మద్దతు ధర కావాలంటే ధాన్యం అమ్ముకోవడానికి కనీసం వారం రోజులు పడుతోంది. నిల్వ ఉంచుకునే సదుపాయాలు లేకపోవడంతో దళారులకు రూ.200 తక్కువకే ఇచ్చేస్తున్నాం. – తోట సూర్యనారాయణ,

పెద్ద కరగాం, నరసన్నపేట మండలం

ముప్పుతిప్పలు

కొనుగోలు కేంద్రాల్లో ట్రక్‌షీట్‌ జనరేట్‌ చేయించుకుని, మిల్లుకు తరలించే లోపు ఆ మిల్లుల్లో అధికంగా ధాన్యం నిల్వలు కనిపిస్తున్నాయి. అక్కడ అన్‌లోడింగ్‌ చేసే విషయంలో జాప్యం జరుగుతోంది. అదనం కూడా అడుగుతు న్నారు. – కవిటి రామరాజు,

వ్యవసాయ సలహా మండలి మాజీ అధ్యక్షుడు, యలమంచిలి, కోటబొమ్మాళి మండలం

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

జిల్లాలో ధాన్యం కొనుగోలులో అవినీతి పెచ్చుమీరిపోయింది. ఏకంగా కీలక నేత సోదరు డు ఓ సంఘం కార్యాలయంలో అధ్యక్షుడి సీట్లో కూర్చొని చక్రం తిప్పుతున్నాడు. నేత, సోదరుడి కనుసన్నల్లో అంతా జరుగుతోంది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, వీటి నిర్వహణ బాధ్యత అనుయాయులకు అప్పగింత, రైతుల నుంచి అదనంగా ధాన్యం తూకం వేసుకుని తీసుకోవడం, మిల్లర్లకు సహకరిస్తున్నందుకు వారి దగ్గర నుంచి రకరకాలుగా ముడుపుల వసూళ్లు అన్నీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.

దళారులే మేలంటూ..

ప్రభుత్వం చెప్పినట్టుగా రైతులు ధాన్యం విక్రయించుకోవాలంటే చాలా వ్యవధి పడుతోంది. డాక్యు మెంట్లు చూపడం, ట్రక్‌షీట్లు, వాహనాల ఏర్పాటు వంటివన్నీ జాప్యానికి కారణాలే. మిల్లర్ల వద్ద కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తేమ శాతం తక్కువగా ఉందని సాకులు చెప్పి ఆరేడు కిలోలు అదనంగా తీసుకుంటున్న దాఖలాలూ ఉన్నాయి. అదే దళారుల ద్వారా మిల్లులకు వెళ్తే ఈ బాధలన్నీ తప్పుతున్నాయి. దీంతో రైతులు దళారులనే ఆశ్రయిస్తున్నారు. దాన్నే కొందరు మిల్లర్లు క్యాష్‌ చేసుకుంటున్నారు.

ఇదే అదనుగా దోపిడీ

గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతు ఉండగా దళారులు క్యాష్‌ చేసుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల కంటే ముందుగానే రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసేశారు. ఆ ధాన్యాన్ని కుమ్మకై ్కన మిల్లర్లకు తరలించారు. దీంతో మిల్లుల్లో ఉన్న ధాన్యానికి, కొనుగో లు కేంద్రాల్లో నమోదైన ధాన్యానికి పొంతన లేకుండా పోయింది. వాస్తవంగా కొనుగోలు కేంద్రాల్లో ఎంత నమోదైతే అంతే ధాన్యం మిల్లుల్లో ఉండాలి. అందుకు భిన్నంగా చాలా వరకు మిల్లుల్లో నిల్వలు ఉన్నాయి. ఇప్పుడీ ధాన్యాన్ని కౌలుకిచ్చిన రైతుల బ్యాంకు ఖాతాలతోను, తమకు కావాల్సిన వారి రైతుల పేరిట అధికంగా విస్తీర్ణం చూపించి ట్రక్‌షీట్‌ జనరేట్‌ చేస్తున్నారు. పలు కేంద్రాల్లో కంప్యూటర్‌ ఆపరేటర్లు కూడా మిల్లర్లు, దళారులతో కుమ్మక్కు కావడం వల్ల ట్రక్‌షీట్‌ జనరేట్‌ మాయాజాలం యథేచ్ఛగా జరిగిపోతోంది. అంటే ప్రభు త్వం ఇచ్చే మద్దతు ధర మొత్తం తమకు కావాల్సిన రైతుల ఖాతాల్లో పడుతుంది. ఆ సొమ్మును తర్వాత డ్రా చేసుకుంటారు. రైతుల నుంచి తక్కువ కొనుగోలు చేసి, ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి మద్దతు ధరను తీసుకుంటారు. ఇదే సమయంలో ఒడిశాలో తక్కువకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా ఇక్కడే కొనుగోలు చేసినట్టు ట్రక్‌షీట్‌ జనరేట్‌ చేయిస్తున్నారు. ఈ రకమైన దోపిడీ జిల్లాలో అత్యధికంగా సారవకోట, నరసన్నపేట, జలుమూరు, పోలా కి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, ఎల్‌ఎన్‌పేట మండలాల్లో ఎక్కువగా జరిగింది. ఇక్కడ జరిగిన అక్రమాలపై ఆరోపణలు అధికారుల దృష్టికి రావడంతో ఓ అధికారి అకస్మిక తనిఖీ చేసి వార్నింగ్‌ ఇచ్చినట్టు తెలిసింది. చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించినట్టు సమాచారం. కానీ, ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.

మిల్లర్ల స్థాయిలో అవినీతి

ప్రభుత్వం త్వరితగతిన కొనుగోళ్లు చేయకపోవడం, కొనుగోలు కేంద్రాల సిబ్బంది చొరవ చూపకపోవడం, ప్రభుత్వం గోనె సంచెలు సకాలంలో ఇవ్వకపోవడం, జీపీఎస్‌ చేసిన రవాణా వాహనాలు అందుబాటులో ఉండకపోవడం, కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో ట్రక్‌ షీట్‌ జనరేట్‌ కాకపోవడం వంటి కారణాలతో రైతులు తప్పని పరిస్థితుల్లో పెద్దల అండదండలున్న మిల్లర్లతో కలిసి వ్యాపారాలు చేస్తున్న దళారులకే అమ్ముకోవాల్సి వస్తోంది. జిల్లాకు చెందిన కీలక నేత, సోదరుడు కనుసన్నల్లో నడుస్తున్న మిల్లులు, వారితో కుమ్మకై ్కన దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారు చెప్పిన ధర నడుస్తోంది.100 కిలోల బస్తాకు ప్రభుత్వం మద్దతుధర రూ.2,389 నుంచి రూ.2369వరకు ఉన్నప్పటికీ రూ.1400 నుంచి రూ.1600 వరకు దళారులు కొనుగోలు చేసి, ఒక్కో బస్తా నుంచి రూ.700 నుంచి రూ.900వరకు దోచుకుంటున్నారు. ఇది చాలదన్నట్టు ఒక బస్తాకు అదనంగా ఐదారు కిలోలు తూకం వేసుకుంటున్నారు.

అన్నదాతకు అన్యాయం1
1/3

అన్నదాతకు అన్యాయం

అన్నదాతకు అన్యాయం2
2/3

అన్నదాతకు అన్యాయం

అన్నదాతకు అన్యాయం3
3/3

అన్నదాతకు అన్యాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement