దారిపై నెత్తుటి చార
ప్రమాదం
రెప్పపాటులో నాలుగు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఒక్క క్షణంలో వారి బతుకులు తెల్లారిపోయాయి. చిమ్మచీకటి, గాఢ నిద్ర, నిబంధనలు పాటించని నిర్లిప్తత కలగలిపి దారిని నెత్తుటి చారగా మార్చేశాయి. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు సమీపంలో తుఫాన్ వ్యాన్ ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఘటనలో నలుగురు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. వీరంతా ఒకటే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. పుణ్యక్షేత్రాల సందర్శనం కోసం బయల్దేరిన వీరి ప్రయాణం సిక్కోలులోనే ముగిసిపోయింది.
టెక్కలి/టెక్కలిరూరల్/నరసన్నపేట:
కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని తుఫాన్ వ్యాన్ ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. మృతులంతా మధ్యప్రదేశ్‌కు చెందిన వారు. సరిగ్గా ఆదివారం వేకువ జామున 2.30 గంటల సమయంలో సంఘటన జరగడంతో సమాచారం మేరకు రూరల్ సీఐ కె.శ్రీనివాసరావు, ఎస్‌ఐ వి.సత్యనారాయణతో పాటు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో మృత దేహాలను వ్యాన్ నుంచి బయటకు తీశారు. గాయపడిన వారికి సపర్యలు చేశారు. అనంతరం ట్రాఫిక్‌ను క్లి యర్ చేశారు. అయితే లారీ డ్రైవర్ భయంతో పరా రై తర్వాత పోలీసులకు చిక్కాడు. ఘటనలో మృతి చెందిన వారిని కోటబొమ్మాళి సామాజిక ఆస్పత్రికి తరలించగా, గాయపడిన వారిని నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడ నుంచి జిల్లా కేంద్రానికి తరలించారు. అనంతరం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన వివరాలను తెలుసుకున్నారు.
బాధితులు వీరే..
మధ్య ప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ దగ్గర కాండవ జిల్లా నితిన్‌గావ్ గ్రామం నుంచి ఒకే కుటుంబానికి చెందిన 10 మంది ఈ నెల 10న పుణ్యక్షేత్రాల సందర్శనకు తుఫాన్ వ్యాన్‌లో బయల్దేరారు. కాశీ దర్శనం అనంతరం పూరీ చేరుకున్నారు. అక్కడి నుంచి శనివారం సాయంత్రం బయల్దేరారు. శ్రీశైలం, తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి ప్రాంతాల సందర్శనకు వెళ్తుండగా, కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లుపాడు సమీపంలో జాతీయ రహదారిలో ఆగి ఉ న్న లారీని బలంగా ఢీ కొనడంతో భోరోసింగ్ పవర్ (60), విజయసింగ్ తోమర్ (65), ఉషిర్ సింగ్ (62), సంతోషి బాయ్ (62) అక్కడికక్కడే మృతి చెందారు. వ్యాన్ డ్రైవర్ సునీల్ పటేల్, సంతోషి భాయి(మృతి చెందిన భోరోసింగ్ పవర్ భార్య) సీమన్ భాయి (మృతి చెందిన ఉషిర్ సింగ్ భార్య), చీరా బాయి, సావిత్రి బాయి, శకుంతల బాయి (మృతి చెందిన విజయసింగ్ తోమర్ భార్య), తోమర్ తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. మృత దేహాలను కోటబొమ్మాళి సామాజిక ఆస్పత్రికి తరలించగా, గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఆగి ఉన్న లారీని ఢీ కొన్న తుఫాన్ వాహనం
నలుగురు మృతి, ఆరుగురికి గాయాలు
కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు సమీపంలో సంఘటన
బాధితులంతా మధ్యప్రదేశ్‌లో ఒకే కుటుంబానికి చెందిన వారు
దైవదర్శనాల్లో భాగంగా పూరీ నుంచి శ్రీశైలం వెళ్తుండగా సంఘటన
దారిపై నెత్తుటి చార
దారిపై నెత్తుటి చార
దారిపై నెత్తుటి చార
దారిపై నెత్తుటి చార
దారిపై నెత్తుటి చార


