చంద్రన్నా.. ఎవరి కోసం? | - | Sakshi
Sakshi News home page

చంద్రన్నా.. ఎవరి కోసం?

Nov 24 2025 7:26 AM | Updated on Nov 24 2025 7:26 AM

చంద్రన్నా.. ఎవరి కోసం?

చంద్రన్నా.. ఎవరి కోసం?

సాయం చేయడంలోనూ అశ్రద్ధ

అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వమే రూ.20వేలు ఇస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. మొదటి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టేశారు. తర్వాత రైతుల సంఖ్య తగ్గించేశారు. కేంద్రంతో కలిపి రూ.20వేలు ఇస్తామని మాట కూడా మార్చేశారు. దాదాపు 43 వేల మందికి ఈ పథకం ఎగ్గొట్టేశారు. ఇక ఉచిత పంటల భీమా, సున్నావడ్డీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ పథకాలను గాలికొదిలేసింది. ఇప్పుడు కూడా జిల్లాలో నరసన్నపేట నియోజకవర్గంలో తప్ప ఎక్కడా ధాన్యం కొనుగోలు చేయలేదు. 264 మిల్లర్లు ఉండగా కేవలం 30మంది మాత్రమే బ్యాంకు గ్యారంటీలు ఇచ్చారు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మొదటి ఏడాది అన్నదాత సుఖీభవలో కోత, నష్టపోయిన పంటపైనా ఆంక్షల మో త, విత్తనాల నుంచి ఎరువుల వరకు రైతన్నకు వెక్కిరింత, సున్నావడ్డీ, ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ అన్నీ ఎత్తివేత, ధాన్యం కొను గోలులోనూ విపరీతమైన అశ్రద్ధ.. 18 నెలల పాలనలో చంద్రబాబు సర్కా రు సాధించిన ఘనతలివి. ప్రజల కళ్ల ముందు ఇంత విధ్వంసం జరిగినా ప్రభుత్వం మాత్రం ‘రైతన్నా...మీకోసం’ అంటూ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పనిలో చూపించలే ని చిత్తశుద్ధిని ప్రచారంలో చూపిస్తోంది.

రైతన్నకు తిప్పలే..

గత ఏడాది ధాన్యం కొనుగోలులో అంతులేని అక్రమాలు జరిగాయన్నది అందరినీ తెలిసిన సత్యమే. రికార్డుల్లో లెక్కలు చూపించి ధాన్యాన్ని కళ్లాల్లోనే వదిలేశారు. చివరికి రైతులకు దళారులే దిక్కుగా మారారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులకు విత్తనాలే దొరకలేదు. విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కిన పరిస్థితులు ఉన్నాయి. ఎరువుల కోసమైతే ఇక చెప్పనక్కర్లేదు. ఎరువుల కోసం గొడవలు జరగ్గా, చాలీచాలనీ ఎరువులను పంపిణీ చేయలేమంటూ వ్యవసాయ శాఖ ఉద్యోగులు ఏకంగా ఆందోళన చేశారు. యూరియా విషయంలోనూ అంతే. ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన యూరియాపై రాజకీయ నాయకుల పెత్తనం ఎక్కువ కావడంతో అది కూడా పక్కదారి పట్టింది. దీంతో రైతులు అధిక ధరలకు, ఒడిశా వెళ్లి కొనుగోలు చేసుకోవాల్సి వచ్చింది.

పంట నష్టంపైనా ఆంక్షలు

అల్పపీడనం, తుఫాన్‌ల ధాటికి జిల్లాలో పెద్ద ఎత్తున పంటలకు ముప్పు వాటిల్లింది. మోంథా తుఫాన్‌తో మరింత నష్టం జరిగింది. కానీ, ప్రభుత్వం 33శాతం కంటే తక్కువ నష్టం ఉందని చాలా నష్టాన్ని జాబితాలో నుంచి తీసేసింది. జిల్లాలో 12,500 ఎకరాలకు పైగా పంట నేలకొరగడమే కాకుండా ముంపునకు గురవ్వగా ఎన్యుమరేషన్‌ పూర్తి చేసేసరికి జిల్లాలో 4,205 ఎకరాల్లోని పంట మాత్రమే నష్టం వాటిల్లినట్టు యంత్రాంగం నిర్ధారించింది. హెక్టార్‌కు రూ. 25వేలు చొప్పున జిల్లా నష్టాన్ని లెక్కించింది. ఇక, పత్తి, మొక్కజొన్న, ఉద్యానవన పంటల నష్టాలకై తే అతీగతి లేదు.

వైఎస్‌ జగన్‌ హయాంలో..

జిల్లాలో రైతుల కోసం 642 రైతుభరోసా కేంద్రాలు, ఏడు ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌లు నిర్మించారు. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా కింద 87,158 మంది రైతులకు గాను రూ 85.14 కోట్లు అందజేశారు. ఎరువులు వంటివి ఇంటికే అందించారు. వైఎస్సార్‌ యంత్రసేవా పథకం కింద 505 ట్రాక్టర్లు, మల్టిపుల్‌క్రాప్‌ ట్రెసర్స్‌, పాడిరేపర్స్‌, రోటావెటర్స్‌, 57 క్లస్టర్లలో వరి కంబైన్డ్‌ హార్వెస్టర్స్‌ వంటివి అందించారు. పాడి రైతులకు సంచార వైద్య సేవలు అందజేశారు.

‘రైతన్నా.. మీకోసం’ అంటున్న చంద్రబాబు సర్కారు

18 నెలల కాలంలో అన్నదాతను ఆదుకోని వైనం

చేసిందేమీ లేకున్నా ప్రచార ఆర్భాటం

ఆఖరికి పంట నష్టంపైనా ఆంక్షలు

ప్రభుత్వ వైఖరిపై విస్తుపోతున్న సిక్కోలు వాసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement