కొత్త వాహనం కొన్నామని..
నరసన్నపేట: కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నుంచి బాధిత కుటుంబ సభ్యులు ఆదివారం సాయంత్రానికీ తేరుకోలేక పోయారు. కళ్ల ముందే భర్తల ను కోల్పోయిన మహిళలు, తండ్రిని, పిల్లనిచ్చిన మామను కోల్పోయిన డ్రైవర్ శోక సంద్రంలో మునిగిపోయారు. వ్యవసాయం చేస్తూ ఉన్నంతలో గౌరవంగా జీవిస్తున్న సునీల్ సింగ్ పటేల్ ఈ మధ్యనే వాహనం కొనుగోలు చేశారు. దీంతో కుటుంబ సభ్యులను అందరినీ తీసుకొని పుణ్య క్షేత్రాల సందర్శనకు బయల్దేరారు. మధ్యప్రదేశ్‌లోని కాండవ జిల్లా నితన్ గావ్‌కు చెందిన వీరందరూ ఈ నెల 10న పుణ్య క్షేత్రాల సందర్శనకు బయలు దేరారు. పూరీలో జగన్నాథుని దర్శనం తరువాత తిరుపతి, శ్రీశైలం, కన్యాకుమారి, రామేశ్వరం వెళ్లాల్సి ఉంది. ఈ లోగా ఇక్కడ ప్రమాదానికి గురయ్యారు.
స్పందించిన ఆర్‌ఎస్‌ఎస్
ప్రమాదంపై ఆర్‌ఎస్‌ఎస్ మధ్య ప్రదేశ్‌కు చెందిన వారి ద్వారా సమాచారం తెలుసుకున్న స్థానిక ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు చింతు పాపారావు, నానాజీ గాడ్గేలు బాధితులకు సహాయం చేశారు. ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించారు. అలాగే మధ్య ప్రదేశ్ సీఎంఓ కార్యాలయం నుంచి కలెక్టర్‌కు సమాచారం రావడంతో ఆయన జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి కళ్యాణ్ బాబుకు పంపి బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకున్నారు. క్షతగాత్రులను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.
కొత్త వాహనం కొన్నామని..


