తీరంలో సందడే సందడి
గార: జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం మొగదాలపాడులో ఆదివారం సందడి వాతావరణం నెలకొంది. కార్తీకమాసం ముగిసినప్పటికీ పిక్నిక్ కోసం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది కుటుంబ సభ్యులతో సహా తరలివచ్చారు. సమీప తోట ల్లో భోజనాలు చేశారు. సాయంత్రం వేళ సముద్రంలో స్నానాలు చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కళింగపట్నం మైరెన్ స్టేషన్ సీఐ బి.ప్రసాదరావు బందోబస్తు ఏర్పాటు చేశారు. మైరెన్ పోలీసులు, సివిల్ పోలీసులు స్థానిక మత్స్యకార యువతతో సమన్వయం చేసుకొని పర్యవేక్షణ చర్యలు చేపట్టారు. పలువురు పర్యాటకులు శాలిహుండం కొండపై బౌద్ధారామాలను సందర్శించారు.


