ఫోన్‌పేలో ట్రాఫిక్‌ చలానాల చెల్లింపు | - | Sakshi
Sakshi News home page

ఫోన్‌పేలో ట్రాఫిక్‌ చలానాల చెల్లింపు

Nov 23 2025 6:17 AM | Updated on Nov 23 2025 6:17 AM

ఫోన్‌పేలో ట్రాఫిక్‌ చలానాల చెల్లింపు

ఫోన్‌పేలో ట్రాఫిక్‌ చలానాల చెల్లింపు

ఫోన్‌పేలో ట్రాఫిక్‌ చలానాల చెల్లింపు

శ్రీకాకుళం క్రైమ్‌: ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లఘిస్తే జరిమానాలు ఇన్నాళ్లూ ఈ–చలానాలు, పోలీసుల యాప్‌ల ద్వారా కట్టాల్సి వచ్చేది. ఇకపై మన మొబైల్‌ నుంచే ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యాప్స్‌ ద్వారా కట్టుకోవచ్చని ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలో వాహనదారులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. పోలీసులు విధించిన ఈ–ఛలానాలు వాహనదారులు చెల్లించకపోవడం, అధిక సంఖ్య లో పెండింగ్‌లోనే ఉండటంతో ట్రాఫిక్‌ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ ఎస్‌ఐ సుధాకర్‌ మాట్లాడుతూ స్మార్ట్‌ఫోన్‌లో ఫోన్‌ పే, గూగుల్‌ పే ఓపెన్‌ అయ్యాక ఆంధ్రప్రదేశ్‌ ఈ ఛలాన్‌ ఆఫర్‌ కనిపిస్తుందని, క్లిక్‌ చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ అని వస్తుందన్నారు. అక్కడ నేరుగా చెల్లించవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement