రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ డౌన్‌లైన్‌లో తాండ్రాసి మెట్ట సమీపంలో శనివారం రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని ప్రయాణికుడు మృతిచెందినట్లు ఆమదాలవలస జీఆర్‌పీ ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపారు. మృతుడి వయసు సుమా రు 40 ఏళ్లు ఉంటుందని, నలుపు దుస్తులు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. వివరాలు తెలిస్తే 9493474582 నంబుకు తెలియజేయా లని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి శవపంచనామాకు తరలించినట్లు తెలిపారు.
టెక్కలి రూరల్: పెద్దసాన గ్రామంలో పి.తమ్మయ్యకు చెందిన ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలి యని వ్యక్తులు శుక్రవారం రాత్రి కాల్చేశారు. రాత్రి ఇంటి ముందు రోడ్డుపై బైక్ ఉంచగా ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు గుర్తించి ఆర్పివేశారు. అప్పటికే వాహనం పూ ర్తిగా కాలిపోయింది. గుర్తుతెలియని వ్యక్తులు తన బైక్‌ను కాల్చి ఉంటారని బాధితుడు శని వారం టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మందస: బాలిగాం బ్రిడ్జి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..ఇచ్ఛాపురం మండలం శాసనం గ్రామానికి చెందిన బి.ధర్మారావు(45) బైక్‌పై వెళ్తుండగా పలాస నుంచి ఇచ్ఛాపురం వైపు గుడ్లు లోడుతో వెళ్తున్న లారీ బాలిగాం బ్రిడ్జి వద్ద ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన ధర్మారావును హైవే అంబులెన్స్‌లో హరిపురం సీహెచ్‌సీకి తరలించారు పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పలాస: ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు గంజాయి తరలిస్తుండగా పలా స ఆర్.పి.ఎఫ్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. వారి నుంచి వద్ద నుంచి 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు జీఆర్‌పీ ఎస్‌ఐ కోటేశ్వరరావు తెలిపారు. రోజు వారీ తనిఖీల్లో భాగంగా పలాస రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆరా తీశామని, బ్యాగులు పరిశీలించగా ఒకరి వద్ద 8 కిలోలు, మరొకరి వద్ద 6 కిలోల గంజాయి పట్టుబడిందని చెప్పారు. గిరిధర్‌జానీ, మరొక రవినాహిక్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. బరంపురం నుంచి ముంబైకు గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించామని ఎస్‌ఐ తెలిపారు.
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి


