లేబర్‌కోడ్‌లు తక్షణమే రద్దు చేయాలి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కార్మికవర్గాన్ని కార్పొరేట్లకు బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో ఐక్యపోరాటాలు తీవ్రతరం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఏఐటీయూసీ నాయకులు చిక్కాల గోవిందరావు, ఇఫ్టూ నాయకులు మామిడి క్రాంతి హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్‌ను నోటిఫై చేయడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం శ్రీకాకు ళం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద ఆల్ ట్రేడ్ యూనియన్స్, ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ కార్మికవర్గం ప్రాణ త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం బానిసలు గా మార్చేలా లేబర్ కోడ్స్‌ను తీసుకురావడం దుర్మార్గమైన చర్యగా మండిపడ్డారు. కార్మిక సంఘా న్ని ఏర్పాటు చేసుకోవడానికి కనీస సభ్యుల సంఖ్య ను అమాంతం పెంచివేయడం, నిరసనలు ధర్నా లు నిర్వహించడానికి అనుమతులను తప్పనిసరి చేయడం, కంపెనీ, సంస్థ కార్యాలయానికి కనీసం రెండు కిలోమీటర్ల దూరంలోనే నిరసనలు చేపట్టాల ని షరతులు విధించడం దారుణమన్నారు. కార్యక్రమంలో అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు సీహెచ్ అమ్మన్నాయుడు, డి.గణేష్, టి.తిరుపతిరా వు, ఆర్.ప్రకాశరావు, సంఘాల నాయకులు ఎం.గోవర్దనరావు, డి.వాసుదేవరావు, జీరు రాము, వై.శ్రీనివాసరావు, ఎన్.బలరాం, ఎల్.రామప్పడు, డి. యుగంధర్, ఎన్.నాగేశ్వరరావు, ఎం.ఆదినారాయణమూర్తి, ఎన్.పార్థసారథి, కె.రవి, బి.సంతోషి, రాజేశ్వరి, పి.మల్లమ్మ, పి.జగ్గారావు పాల్గొన్నారు.


