జాతీయ చెస్ పోటీలకు డొంకూరు విద్యార్థులు
ఇచ్చాపురం రూరల్: ఇటీవల విశాఖపట్నం వేదికగా బాల బాలికలకు ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో డొంకూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి చెస్ పోటీలకు ఎంపికయ్యారు. అండర్–14 బాలురు విభాగంలో డి. చర ణ్, అండర్–15 విభాగంలో డి.గోకుల్, డి.పృథ్వీ ఎంపికకావడంతో శనివారం ప్రధానోపాధ్యాయురాలు జి.హేమాకుమారి అభినందించారు. ఈ నెల 23 నుంచి 24 విజయవాడ వేదికగా జరగబోయే జాతీయస్థాయి పోటీల్లో వీరు ప్రాతినిధ్యం వహిస్తా రు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు వజీర్ అహ్మద్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కె.జానకిరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కవిటి : కవిటి సినిమా హాల్ రోడ్డులోని శ్రీవేంకటేశ్వర డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌లో శుక్రవారం చోరీ జరిగింది. ల్యాప్‌ట్యాప్, సుమారు రూ.50,000 నగదు అపహరణకు గురైందని యజమాని వెంకటరావు చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ వి.రవివర్మ పరిశీలించారు.


