‘ఉద్దానంలో విధ్వంసం సహించబోము’
వజ్రపుకొత్తూరు రూరల్: పచ్చని ఉద్దాన ప్రాంతంలో కార్గో ఎయిర్ పోర్టు పేరుతో విధ్వంసం సృష్టిస్తే సహించేది లేదని కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొమర వాసు, జోగి అప్పారావు స్పష్టం చేశారు. కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం పాలకులు చేసిన ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని, బలవంతపు భూ సే కరణ ఆపాలని కోరుతూ ఒంకులూరులో శనివారం నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్దానం ప్రాంతాన్ని ఏళ్ల తరబడి కీడ్నీ భూతం పట్టి పీడిస్తుంటే, ఇది చాలదన్నంటూ నేడు పాలకులు కార్గో భూతానికి ఉద్దాన ప్రజలను బలి చేసేందుకు ప్రతిపాదన లు తీసుకువచ్చారని మండిపడ్డారు. తమ జీవితాల ను నాశనం చేసే కార్గో ఎయిర్ పోర్టుకు వ్యతికేరంగా 26వ తేదీ వరకు కార్గో బాధిత గ్రామాల్లో నిరస న కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్య క్రమంలో నాయకులు రామస్వామీ, రామారావు, సురేఖ, రైతులు ఉన్నారు.


